Wednesday, January 22, 2025

బయటి ఫుడ్ తింటున్నారా? – జర భద్రం

- Advertisement -
- Advertisement -

రెస్టారెంట్లు, హోటళ్లతో పాటు పానీపూరీ, ఛాట్ వంటి బయటి ఫుడ్‌ను చాలామంది ఇష్టంగా తింటుంటారు. అయితే, తాజాగా బయట కొన్న ఆహారాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు తరచూ వింటున్నాం. తాజాగా ఓ వ్యక్తి స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకున్న చికెన్ ఫ్రైలో పురుగు కనిపించడం కలకలం రేపింది. అలాగే, మరో చోట హోటల్‌లో దోశ తింటుండగా అందులో బొద్దింక ప్రత్యక్షమైంది. బాధిత వినియోగదారులు వెల్లడించిన వివరాల ప్రకారం నగరంలోని హైటెక్ సిటీ సైబర్ టవర్స్ ఎదురుగా ఉన్న ఓ హోటల్ నుంచి అనిరుథ్ అనే వ్యక్తి స్విగ్గీలో చికెన్ ఫ్రై, చికెన్ న్యూడిల్స్, మెజిస్టిక్స్ ఆర్డర్ చేశారు. ఫుడ్ డెలివరీ తీసుకుని వాటిని ఓపెన్ చేసి తింటుండగా పురుగును చూసి షాకయ్యారు. దీనిపై జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. సదరు హోటల్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.

దోశలో బొద్దింక
సోమాజీగూడ యశోద ఆస్పత్రి ఎదురుగా ఉన్న ఓ హోటల్‌లో రాఘవేంద్ర కుమార్ అనే వ్యక్తి దోశ తింటుండగా బొద్దింక ప్రత్యక్షమైంది. దీన్ని చూసిన వెంటనే అతను షాక్‌కు గురై హోటల్ నిర్వాహకులను ప్రశ్నించాడు. అయితే, వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో జిహెచ్‌ఎంసి అధికారులకు ఫిర్యాదు చేశాడు. సదరు హోటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరాడు. కాగా, ఇటీవలే నగరంలో మోమోస్ తిని ఓ మహిళ మృతి చెందగా 20 మంది అస్వస్థతకు గురయ్యారు. సాధ్యమైనంత వరకూ బయటి ఫుడ్ తినొద్దని.. ఒకవేళ తిన్నా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే, ఇటీవలే ఓ హోటల్‌లోని ఇడ్లీలో బొద్దింక కనిపించిన ఘటన సంచలనం రేపిన సంగతి విదితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News