Monday, December 23, 2024

థైరాయిడ్ గ్రంధి నుంచి ”కొబ్బరికాయ” సైజు కణితి తొలగింపు

- Advertisement -
- Advertisement -

Coconut size tumour successfully removed in Delhi

న్యూఢిల్లీ: బీహార్‌కు చెందిన ఒక 72 సంవత్సరాల రైతు థైరాయిడ్ గ్రంధి(గ్లాండ్)లో కొబ్బరికాయంత పరిమాణంలో ఏర్పడిన కణితిని ఇక్కడి ఒక ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్స ద్వారా విజయవంతంగా తొలగించారు. బీహార్‌లోని బెగుసరాయ్ జిల్లాకు చెందిన ఆ వృద్ధుడు గత ఆరు నెలలుగా శ్వాసపీల్చుకోవడం, ఆహారం మింగడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని సర్ గంగారాం ఆసుపత్రిలోని ఇఎన్‌టి, హెడ్ అండ్ నెక్ ఆంకో సర్జరీ డిపార్ట్‌మెంట్ కన్సల్టెంట్ డాక్టర్ సంగీత్ అగర్వాల్ తెలిపారు. పాధారణంగా శీతాకోక చిలుక ఆకారంలో 10 నుంచి 15 గ్రాముల బరువు, 3 నుంచి 4 సెంటీమీటర్ల పరిమాణంలో ఉండే థైరాయిడ్ గ్రంధి ఈ రోగికి మాత్రం 18 నుంచి 20 సెంటీమీటర్ల సైజులో కొబ్బరికాయంత పరిమాణంలో ఉందని ఆయన చెప్పారు. ఈ కణితిని తొలగించడంలో అనేక సవాళ్లు ఉన్నాయని, రోగి స్వరపేటికను కాపాడడం ఇందులో అత్యంత ముఖ్యమైనదని ఆయన తెలిపారు. వాయు నాళాన్ని కుంచించడం ద్వారా రోగికి ఒక ప్రత్యేక పద్ధతిలో అనెస్థీషియా ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. మూడు గంటల పాటు సర్జరీ నిర్వహించినట్లు ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News