Thursday, December 5, 2024

ఆరోగ్యానికి అండ.. కొబ్బరి బోండా

- Advertisement -
- Advertisement -

Coconut Water Benefits in Telugu

హైదరాబాద్ : మన ఆరోగ్యాన్ని ఎల్లవేళలా చల్లగా, అనారోగ్యాలకు దూరంగా ఉంచే దివ్యఔషధం కొబ్బరి బోండం. రోడ్ల పక్కన వెలిసిన ఫాస్ట్‌పుడ్‌లతో కోరి తెచ్చుకొనే అల్సర్ నుంచి ఉపశమనాన్ని కలిస్తుంది. కొలెస్ట్రాల్ లేకపోవడంతో గుండెకు మేలు చేస్తుందని వైద్య నిఫుణులు సూచిస్తున్నారు. ప్రపంచ జనాభాలో మూడోవంతు కొబ్బరితో చేసిన పదార్థులను వాడుతుంటారు. కొబ్బరినీళ్లు, నూనె… ఇలా రకరకాల కొబ్బరి పదార్థాలు మన నిత్య జీవితంలో భాగంగా మారిపోతున్నాయి. కొబ్బరి నీళ్లను పిల్లలు తాగడం వల్లన మానసిక శారీరక ఎదుగుదల, మూత్ర పిండాలు సాఫీగా పనిచేసేందుకు ఎం తో సహకరించడమే కాకుండా గుండెకు బలాన్ని కూ డా చేకురుస్తుంది. వాంతులు విరోచనాలను అదుపు చేస్తుంది. పచ్చ కామెర్లకు ఔషధంగా పనిచేస్తుంది. వడదెబ్బను నివారించడమే కాకుండా శరీరంలో వేడి తీవ్రతను తగ్గించి చల్లదనానికి తోడ్ప డుతుంది. అం తే కాకుండా కొబ్బరి నీళ్లు తాగడంమే కాకుండా వివి ధ రకాల శుభకార్యాలకు, అభిషేకాలకు కొబ్బరి బోండం తప్పకుండా ఉండాల్సిందే. ప్రపంచంలో ప్రతి దానిని కలుషితం చేస్తున్న ఇప్పటి వరకు కొబ్బరి నీటిని చేయాలేదంటే అతియోశక్తి కాదు.

భానుడు ప్రతాపంతో.. చల్లదనం కోసం

భానుడు ప్రతాపం రోజు రోజుకు తీవ్రతరం అవుతున్నాయి. ప్రజలు ఇంటి నుంచి బయట కు అడుగు పెట్టాలంటే జంకుతున్నారు. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేం దుకు సామాన్య పేద, మధ్య తరగతి ప్రజలు శీతల పానీయాలు, పండ్ల రసాలను, కొబ్బరి బోండాలను ఆశ్రయిస్తు సేద తీరుతున్నారు. ముఖ్యంగా ప్రయాణికులు ఎండ వేడి మికి తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొద్ది దూరం కూడా తమ ప్రయాణం సాగక ముందే నోరంత ఎండిపోయి తడి ఆరిపోయి దాహమంటూ చల్లని తాగునీటి కోసం పరితపిసు ్తన్నారు.

పోషకాల బోండం…

వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా నీరసించిన శరీరానికి తక్షణ శక్తిని సమకూర్చే ప్రకృతి పానీయాలలో కొబ్బరి బోండం పోషకాల భాం డం అంటుంటారు. అయితే ఎన్నో పోషకాలున్న కొబ్బరి బోండాలను తాగేందుకు ఎక్కువ మక్కువ చూపడంతో వీటి అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. అంబర్‌పేట నియోజకవర్గంలోని కాచిగూడ సర్కిల్‌లోని నారాయణగూడ, బర్కత్‌పుర, చెప్పల్‌బజార్, మోతిమార్కెట్ తదితర ప్రాంతాల్లో రోడ్లకు ఇరువైపులా కొ బ్బరి బోండాల షాపులను ఏర్పాటు చేశారు. ఒక్కో బోండం ధర రూ. 30 నుంచి 45 విక్రయిస్తున్నారు. లీటరు కొబ్బరి నీటిని 120నుంచి 150 వరకు అమ్ముతు న్నారు. వేసవిలో కొబ్బరి నీళ్లు తాగుతే ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చంటున్నారు వైద్య నిపుణులు.

వాటిలో ముఖ్యమైన ప్రయోజనాలివి..

వేసవి తీవ్రత నేపథ్యంలో శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ నష్టపోయి విరేచనాలు, వడదెబ్బ వంటి ఆరోగ్య రుగ్మతలు వస్తాయి. అలాంటప్పుడు తక్షణం కొబ్బరినీ ళ్లుతీ సుకోవడం వల్ల అనేక కేలరీల శక్తి, వివిధ పోషకాలు, ఆరోగ్యానికి ఉపయోగపడే విటమిన్లు చూకూరుతాయి. కొబ్బరి బోండా నీరు సహజ సిద్ధంగా లభించే శుద్ధి కర పానీయం.
1)అధిక బరువు : ఇందులో ఉండే బయోయాక్టివ్ ఎంజెమ్స్ జీవ, జీర్ణక్రీయలను పెరుగుపరచడానికి తోడ్పడతాయి. తద్వారా బరవు తగ్గే ప్రక్రియ వేగవంత మవుతుంది.
2)ఎసిడిటీ : కొబ్బరి నీళ్లలోని ఎంజెమ్స్‌తో పాటు అధికమొత్తంలో లభ్యమయ్యే ఫైబర్..పేగుల కదలికను నియంత్రిస్తుంది. ఎసిడిటీ, అజీర్ణం, ఇతర పేగు సంబంధిత సమస్యలను దూరంగా ఉంచుతుంది.
3) డీహైడ్రేషన్ : శరీరంలో ఎలక్ట్రోలైట్స్‌ను తిరిగి నింపడంలో కొబ్బరినీళ్లు ఎంతో ఉపకరిస్తాయి. తద్వారా శరీరానికి అసరమైన నీటిని అందించి, డీహైడ్రేష న్‌కు గురికాకుండా రక్షిస్తాయి.
4) బీపీ : రోజూ కొబ్బరి నీళ్లు తాగడం వల్ల హైపర్‌టెన్షన్ నియంత్రణలో ఉంటుందన్నది ఓ పరిశోధన సారాంశం. కొబ్బరి నీరు ర్త పోటును సరైన స్థాయిలో ఉంచడానికి దోహదపడుతుంది.
5)డీటాక్సిఫికేషన్ : కొబ్బరి నీళ్లలోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపించి, కడుపులో మంటను తగ్గిస్తాయి.
6)కిడ్నీలో రాళ్లను కరిగిస్తుంది : కొబ్బరి నీరు మూత్ర, వ్యవస్థలపై థెరపటిక్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. మూత్రకోవ ఇన్ ఫెక్షన్లు, మూత్రపిండంలో రాళ్లను తగ్గిస్తుంది. అదే విధంగా కిడ్నీలో రాళ్లు కరిగిపోవడానికి కొబ్బరి నీటిని తాగడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుందని వైద్య నిపుణులు
7)గుండె జబ్బులు తగ్గించడంలో.. గుండె జబ్బులు అధిక రక్తపోటు ప్రధానకారణం. పోటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు రక్తపోటును తగ్గించడంలో సహకరిస్తాయి.

100 మిల్లీ లీటర్ల కొబ్బరి నీళ్లలో లభించే పోషకాలు…

* సోడియం 105 మిల్లీ గ్రామలు
* పొటాషియం 250మిల్లీ గ్రామలు
* 3.71 గ్రాముల ప్రోటీన్స్
* విటమిన్ సి, బి కాంప్లెక్స్
* 24 మిల్లీ గ్రాముల కాల్షియం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News