Thursday, September 19, 2024

ఇన్ఫోసిస్ మీద కేసు దాఖలు చేసిన కాగ్నిజెంట్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఐటి మేజర్ కాగ్నిజెంట్ యొక్క అనుబంధ సంస్థ ట్రైజెట్టో, బెంగళూరు ప్రధాన కార్యాలయంగా ఉన్న ఇన్ఫోసిస్‌పై వాణిజ్య రహస్యాలు, హెల్త్ కేర్ ఇన్సూరెన్స్ సాఫ్ట్‌ వేర్‌కు సంబంధించిన సమాచారాన్ని దొంగిలించిందని ఆరోపిస్తూ అమెరికా ఫెడరల్ కోర్టులో దావా వేసింది.

ఇన్ఫోసిస్ తన ప్రకటనలో అన్ని ఆరోపణలను ఖండించింది. దావా గురించి తమకు తెలుసని, కోర్టులో తమ వైఖరిని సమర్థించుకుంటామని పేర్కొంది. టెక్సాస్ ఫెడరల్ కోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంలో కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్… ట్రైజెట్టో నుండి డేటాను అక్రమంగా యాక్సెస్ చేసిందని ఆరోపించింది.

టెక్సాస్ ఫెడరల్ కోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంలో కాగ్నిజెంట్ ఇన్ఫోసిస్ ట్రైజెట్టో సాఫ్ట్‌ వేర్ — ఫేసెట్ మరియు క్యూఎన్‌ఎక్స్‌ టి నుండి డేటాను చట్టవిరుద్ధంగా యాక్సెస్ చేసిందని , పోటీ ఉత్పత్తిని అభివృద్ధి చేయడానికి , మార్కెట్ చేయడానికి ఉపయోగిస్తున్నారని ఆరోపించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News