Sunday, December 22, 2024

కొయంబత్తూర్ కారు పేలుడు కేసులో మరో వ్యక్తి అరెస్టు

- Advertisement -
- Advertisement -

Coimbatore car blast

కొయంబత్తూర్: పోలీసులు ఆదివారం ఉదయం జరిగిన కొయంబత్తూర్ కారు పేలుడు ఘటనలో మరో వ్యక్తిని అరెస్టు చేశారు. విన్సెంట్ రోడ్డులోని కె. అఫ్సర్ ఖాన్(28)ను బుధవారం రాత్రి అరెస్టు చేశారు. కొట్టయిమేడు వద్దనున్న సంగమేశ్వరర్ మందిరం ముందు జరిగిన కారు పేలుడులో చనిపోయిన జమీశ ముబైన్ బంధువే ఈ అఫ్సర్ ఖాన్. అతడు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా పేలుడు పదార్థాలను(పొటాషియం నైట్రేట్, అల్యూమినియం పౌడర్, సల్ఫర్, చార్‌కోల్) సేకరించినట్లు పోలీసులు తెలిపారు. కారు పేలుడు కేసులో పోలీసులు ఇప్పటికే ఐదుగురిని అరెస్టు చేశారు. వారిని 120బి, 153ఏ, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం సెక్షన్లు 16, 18 కింద వారిపై కేసులు పెట్టారు. ఇదిలావుండగా ఈ కారు పేలుడు కేసును కొయంబత్తూర్ సిటీపోలీసుల నుంచి ఎన్‌ఐఏ అధికారులు తీసుకోబోతున్నట్లు అబిజ్ఞవర్గాల బోగట్టా.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News