Monday, December 23, 2024

స్టార్ హోటల్‌లో చిల్లర నాణేలతో బిల్ పేమెంట్ (ఫన్నీ వీడియో)

- Advertisement -
- Advertisement -

 

న్యూస్‌డెస్క్: స్టార్ హోటళ్లకు వెళ్లేవారంతా డబ్బున్న వాళ్లేనని చాలామంది అపోహపడుతుంటారు. అక్కడకు వెళ్లే కస్టమర్లు బిల్లు చూసి కంగారు పడకుండా కరెన్సీ నోట్లతోనో లేక కార్డుతోనే పేమెంట్ చేస్తుంటారని భావిస్తుంటారు. అయితే చిల్లర నాణేలతో బిల్లు చెల్లిస్తే ఎలా ఉంటుంది…దాన్ని హోటల్ సిబ్బంది స్వీకరిస్తారా? ఈ ప్రశ్నలు మనకే కాదు..
ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్ సిద్ధేష్ లోకారేకు కూడా వచ్చాయి. చిల్లర నాణేలతో బిల్లు చెల్లిస్తే ఎలా ఉంటుందో స్వయంగా తెలుసుకునేందుకు అతను ముంబై తాజ్ హోటల్‌కు వెళ్లాడు. సామాన్యుడిలా వెళితే హోటల్‌లోకి రానివ్వరేమో అన్న సందేహంతో అతను హోటల్ బయటే కోటు కూడా వేసుకున్నాడు.

బేరర్‌కు ఆర్డర్ చేసే ముందు మెనూ కార్డులో రేట్లు చూసి అతను షాకయ్యాడు. పిజ్జా, మాక్ టెయిల్ మాత్రం ఆర్డర్ ఇచ్చాడు. తిన్న తర్వాత అతను చిల్లర నాణేలతో కూడిన చిన్న సంచులను, కొన్ని నోట్లను బేరర్‌కు పే చేశాడు. వాటిని చూసి బేరర్‌తోపాటు ఇతర కస్టమర్లు కూడా షాకయ్యారు. అయితే..బేరర్ మాత్రం ఆ చిల్లర నాణేలను ఎంతో వినయంగా స్వీకరిస్తూ వాటిని లెక్క పెట్టడానికి కొంత సమయం పడుతుందని చెప్పాడు. ఈ సరదా దృశ్యాలను సిద్ధేష్ కెమెరాలో షషూట్ చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సమాజంలో ఎవరూ ఎక్కువ, తక్కువ కాదని, ఆత్మన్యూనతకు ఎవరూ లోను కావలసిన అవసరం లేదంటూ సిద్ధేష్ తన వీడియోలో పేర్కొన్నాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News