Monday, December 23, 2024

రాజస్థాన్ ఎస్‌బిఐ బ్రాంచి నుంచి రూ. 11 కోట్ల నాణేలు అదృశ్యం

- Advertisement -
- Advertisement -

coins worth 11 crores missing from sbi bank

25 చోట్ల సిబిఐ దాడులు

న్యూఢిల్లీ : రాజస్థాన్ కరౌలీ ఎస్‌బిఐ బ్రాంచిలో రూ. 11 కోట్ల విలువైన నాణేలు అదృశ్యం కావడంపై సిబిఐ 25 చోట్ల దాడులు జరిపింది. ఢిల్లీ, జైపూర్, దౌసా, కరౌలీ, సవాయి మథోపూర్, అల్వార్, ఉదయ్‌పూర్, భిల్వారా ప్రాంతాల్లో 15 మాజీ బ్యాంకు అధికారుల నివాసాలపై ఈ దాడులు జరిగాయి. రాజస్థాన్ హైకోర్టు ఆదేశాలపై సిబిఐ ఏప్రిల్ 13న దీనిపై కేసు నమోదు చేసింది. 2021 ఆగస్టులో నగదు నిల్వల లెక్కింపులో తేడా కనిపించడంతో ఈ విషయం వెలుగు లోకి వచ్చింది. నగదు లెక్కింపును ప్రైవేట్ సంస్థచేపట్టడంతో ఆ సంస్థ రూ. 11 కోట్ల నాణేలు గల్లంతు అయ్యాయని తేల్చింది. రూ. 2 కోట్ల విలువైన 3000 నాణాల సంచులు మాత్రమే అకౌంట్‌లో జమ అయ్యాయని, ఆర్‌బిఐ నాణేల విభాగానికి పంపడమైందని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News