- Advertisement -
దేశం లోని ఉత్తరాది రాష్ట్రాలపై చలిపంజా విసురుతోంది. ఢిల్లీ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు చలికి తట్టుకోలేక పోతున్నారు. ఢిల్లీ, జమ్ముకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లో చలి తీవ్రత పెరిగింది.అనేక చోట్ల దట్టమైన పొగమంచు కమ్మేసింది. మంగళవారం ఉదయం ఢిల్లీలో కనీస ఉష్ణోగ్రతలు 8.0 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. జమ్ముకశ్మీర్‌లో గరిష్టంగా 10 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా మైనస్ 2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లో కనిష్ట ఉష్ణోగ్రతలు 8 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. పశ్చిమబెంగాల్ లోని కోల్‌కతాలో 19.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అలహాబాద్‌లో ఉదయం 10 గంటలకు 18 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
- Advertisement -