Wednesday, January 22, 2025

నగరంలో పెరుగుతున్న చలి తీవ్రత…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలో క్రమంగా చలితీవ్రత పెరుగుతుండడంతో సిటీ వాసులు గజ గజ వణికి పోతున్నారు. శీతకాలం ప్రవేశంతోనే చలి సైతం విజృభింస్తుండడంతోనగరవాసులు హడలి పోతున్నారు. ఆక్టోబర్ చివరి వారంలో నగరంలో ఒక్కసారిగా పెరిగిన చలితో తీవ్రతతో ప్రజలు వణికిపోయ్యారు. అయితే నవంబర్ 1 నుంచి కొంత తగ్గుముఖం పట్టిన చలి 19 నుంచి 20 డీగ్రీల మధ్య నమోదైంది అయితే గత రెండు రోజుల నుంచి మళ్లీ చలి తీవ్రత నగరవాసులను ఇబ్బంది పెడుతోంది. ఆదివారం రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 16.8 డిగ్రీలుగా నమోదు కావడం, ఇది సాధారణం కంటే 3 డిగ్రీలు తక్కువ. ఒక్కసారిగా చలి తీవ్రత పెరగడంతో నగరవాసుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

సాయంత్రం 5 గంటల నుంచే చలి గాలులు వీస్తుండడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా పగటి ఉష్ణోగ్రతలు సైతం సాధారణం కంటే 1 నుంచి 2 డీగ్రీలు తక్కువగా నమోదు అవుతున్నాయి. దీంతో ఉదయం వేళా కూడా పలు ప్రాంతాల్లో చలిగానే ఉంటోంది. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో చలి తీవ్రత అధికంగా ఉంటోంది. దీంతో తెల్లవారు జామున పనుల నిమిత్తం బయటికి వెళ్లే వారు చలితో వణికిపోతున్నారు. అదేవిధంగా ఇళ్లలో సైతం చిన్నారులు, వృద్దులు చలితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

శివారు సర్కిళ్లలో అధిక చలి 

గ్రేటర్‌లోని శివారు సర్కిళ్లలో కనిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా క్షీణించాయి. దీంతో శివారు ప్రాంత వసులు చలితో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో ఆదివారం రాత్రి 14.9 డిగ్రీలు నమోదైంది. ఇది సాధారణ కంటే 5 డిగ్రీలు తక్కువ కావడంతో పరిసర ప్రాంతాల వాసులు చలితో విలవిలలాడారు. అదేవిధంగా నగరంలోని వెస్ట్ మారెడ్‌పల్లిలో సైతం కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల లోపు నమోదైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News