Sunday, November 24, 2024

చలి తీవ్రత పెరుగుతోంది ..జాగ్రత్త :ఐఎండి హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతూ వస్తోంది. రానున్న రెండు రోజులు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇప్పటికే రాష్ట్రంలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల వల్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని వాతావరణ కేంద్రం తెలిపింది. దీనివల్ల ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో చలి తీవ్రత పెరిగిందని వెల్లడించింది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతున్నాయి. ఉత్తరాది నుంచి జోరుగా వీస్తున్న గాలులకు తోడుగా గాలిలో తేమశాతం పెరగడంతో ఉదయం వేళల్లో చాలా గ్రామాల్లో పొగమంచు కమ్ముకుంటున్నది.

తెల్లవారుజామున 5 నుంచి ఉదయం 8గంటల వరకు గ్రామాలతో పాటు రహదారులను మంచు తెరలు కమ్మేస్తున్నాయి. మరో రెండు రోజులు చలి తీవ్రత ఎక్కువగానే ఉంటుందని పేర్కొంది. జనవరి ఒకటవ తేదీ తర్వాత చలి మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ క్రమంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. చలి అధికం కావడంతో పిల్లలు, వృ ద్ధులు ఇబ్బందులకు గురవుతున్నారు. అలర్జీ, ఆస్తమా, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, బీపీ, గుండె సంబంధిత వ్యా ధులు కలిగిన వారు జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News