Saturday, December 21, 2024

కొందరి బండారం బయటపెడతా: జగ్గారెడ్డి

- Advertisement -
- Advertisement -

Cold war in Telangana congress party

హైదరాబాద్: తాను వందశాతం రాజకీయ నాయకుడినేనని కాంగ్రెస్ ఎంఎల్‌ఎ జగ్గారెడ్డి తెలిపారు. వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను అవమానకరంగా తొలగించడంతో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ ప్రెస్‌మీట్‌లో కొందరి బండారం బయటపెడతానని హెచ్చరించారు. ఢిల్లీకి ఎవరు పోయారో తనకు తెలియదన్నారు. కాంగ్రెస్‌లోనే తప్పొప్పులు మాట్లాడుకునే వీలు ఉంటుందని జగ్గారెడ్డి తెలిపారు. పదవుల కోత అనేది స్పోర్టివ్‌గా తీసుకుంటానన్నారు. ఆ మాటలు వెనక్కి తీసుకుంటానన్నారు. మరో వైపు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి తీరుపై జగ్గారెడ్డి సీరియస్‌గా ఉన్నారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కోల్డ్‌వార్ తారాస్థాయికి చేరుకుంది. ఓ వైపు ఢీల్లీలో హైకమాండ్ ముందు సీనియర్లు పంచాయతీ పెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News