Tuesday, January 21, 2025

రైల్వే స్టేషన్‌లో కూలిన పాదచారుల వంతెన

- Advertisement -
- Advertisement -

బలార్షా : మహారాష్ట్రలోని ప్రధాన రైల్వే జంక్షన్ బల్షారాలో ప్రయాణికులు వినియోగించుకునే ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఆదివారం సాయంత్రం కుప్పకూలింది. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో దాదాపు పది మంది పరిస్థితి విషమంగా ఉందని వెల్లడైంది. చంద్రాపూర్ జిల్లాలోని ఈ రైల్వే జంక్షన్‌లో నిత్యం వేలాది మంది ప్రయాణికులు వస్తూ పోతూ ఉంటారు.

ప్రయాణికులువస్తూ పోతూ ఉన్న దశలోనే ఈ 60 అడుగుల ఎత్తున ఉన్న ఫుట్ బ్రిడ్జి కూలి అక్కడి నుంచి జనం కింద పడ్డారు. ఈ దశలో పలువురు గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి పంపించి వైద్య చికిత్సలు జరుపుతున్నారు. తీవ్రంగా గాయపడ్డ వారికి రూ లక్ష చొప్పున, గాయపడ్డ వారికి రూ 50000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్లు రైల్వే విభాగం ప్రజా సంబంధాల అధికారి తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News