Thursday, April 3, 2025

జార్ఖండ్‌లో కూలిన రైల్వే అండర్‌పాస్

- Advertisement -
- Advertisement -

Collapsed railway underpass in Jharkhand

నలుగురు కార్మికుల మృతి

ధన్‌బాద్(జార్ఖండ్): ధన్‌బాద్‌కు 15 కిలోమీటర్ల దూరంలోని బలియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఛటకులి గ్రామ సమీపంలో నిర్మాణంలో ఉన్న రైల్వే అండర్‌పాస్ కూలిపోయి నలుగురు ఆకర్మికులు మరణించారు. మంగళవారం రాత్రి 8.45 గంటల ప్రాంతంలో సమీపంలోని రైల్వే ట్రాక్‌పై గూడ్సు రైలు వెళ్లిన కొద్ది నిమిషాలకే నిర్మాణంలో ఉన్న అండర్‌పాస్ బ్రిడ్జి కూలిపోయినట్లు రైల్వే అధికారులు బుధవారం తెలిపారు. ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్‌కు చెందిన ఆరుగురు కార్మికులు అక్కడ పనిచేస్తున్నారని వారు చెప్పారు. వీరిలో నలుగురు మరణించారని వారు తెలిపారు. వీరంతా బలియాపూర్‌లోని కుల్హి గ్రామానికి చెందినవారని డిఎస్‌పి అభిషేక్ కుమార్ తెలిపారు. కార్మికుల మరణంపై ఆగ్రహించిన గ్రామస్తులు రైల్వే ట్రాక్‌ను అడ్డగించడంతోపాటు ప్రధాన్‌ఖాంట రైల్వే స్టేషన్ వద్ద గ్రాండ్ కార్డ్ రైల్వే లైన్‌ను మూసివేశారు. దీంతో ధన్‌బాద్, టాటానగర్ మధ్య నడిచే స్వర్ణ రేఖ ఎక్స్‌ప్రెస్‌తోసహా మూడు రైళ్లను అధికారులు రద్దు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News