Monday, January 20, 2025

10లక్షల టన్నుల కందుల సేకరణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ధరల స్థిరీకరణ పథకం ద్వారా ప్రస్తుత వ్యవసాయ సీజన్‌లో దేశవ్యాప్తంగా రైతుల నుంచి 10లక్షల టన్నుల కందులను నాఫెడ్ (జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ సమాఖ్య )ద్వారా సేకరించాలని లక్షంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్టం నుంచి 50వేల టన్నుల కందులను వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా, ప్రధామిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా, జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీల ద్వారా, ఎఫ్‌పివోల ద్వా రా, తెలంగాణ మార్క్‌ఫెడ్ సంస్థ ద్వారా సేకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ను నోడల్ ఏజెన్సీగా నియమించింది. విదేశాల నుంచి కందుల దిగుమతిపై ఆధారపడటాన్ని తగ్గించుకోవటంతోపాటు, పప్పుధాన్యాలు పం డించే రైతులకు ఆదనపు లాభం సమకూర్చడమే లక్షం గా కందుల సేకరణను కేంద్రం లక్షంగా పెట్టుకుంది. తొలిసారి మద్దతు ధరలకు మించి రోజువారి మార్కెట్ రేటుకు అనుగుణంగా వ్యాపారులతో పోటీ సడి రైతులకు అత్యధిక ధర చెల్లించి కందులు సేకరణకు ప్రభుత్వం సిద్దంగా ఉంది.

ప్రత్తుతం తెలంగాణ రాష్ట్రలో ఖరీఫ్ సీజన్ కింద 4,74,299 ఎకరాల విస్తీర్ణంలో కందులు సాగు చేయగా, తద్వారా 2.37లక్షల టన్నుల కంది పంట దిగుబడులు వస్తాయని అంచనావేశారు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం కందిపంటకు కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.7000 ప్రకటించింది. అయితే మార్కెట్‌లో అంతకు మించి ధర పలుకుతోంది. క్వింటాలుకు రూ.9500 నుంచి 10,500 మధ్య ధర పలుకుతోంది. ఈ నేపధ్యం లో వ్యాపారులతో పోటీ పడి కందులు కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రం లో ధరల స్థిరీకరణ ద్వారా గడిచిన నాలుగన్నరేళ్లలో తెలంగాణ మార్క్‌ఫెడ్ పెద్ద ఎత్తున కంది పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చేస్తోంది. దీంతో కందుల సేకరణ బాధ్యతలను కూడా తెలంగాణ మార్క్‌ఫెడ్‌కు ప్రభుత్వం అప్పగించింది. గురువారం నుంచే రాష్ట్రంలో రైతుల నుంచి కందులను కొనుగోలు ప్రక్రియను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

వ్యవసాయ మార్కెట్టపై మంత్రి ఆరా
రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్లపై ఆ శాఖ మంత్రి తు మ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు. బుధవారం మంత్రి మార్కెటింగ్‌శాఖ అధికారులతో వివిధ మార్కెట్‌లో వ్యవసాయ ఉత్పత్తుల క్రయ విక్రయాలను ఆరా తీశారు. ఖమ్మం మిర్చి మార్కెట్‌తో పాటు రాష్ట్రంలోని మిగతా మార్కెట్లలో జరిగే అమ్మకాలు,కొనుగోళ్లపై, ముఖ్యంగా మిర్చి మార్కెట్లలో పడిపోతున్న ధరల గురించి రాష్ట్ర వ్యవసాయ, చేనేత, మార్కెటింగ్‌శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు. మార్కెట్లలో ఎలాం టి అవక తవకలకు తావులేకుండా, ధరలు క్షీణించ కుండా చూడాలని, రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా తగిన చర్యలు తీసుకోవాలని అగ్రికల్చర్,మార్కెటింగ్ శాఖాధికారులను ఆదేశించారు. మిరప పంట ధరల తగ్గుదలకు కారణాలను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ యార్డుల్లో అనునిత్యం మైకుల ద్వారా ప్రచారం చేయాలని, కరపత్రాలు పంచాలని, పత్రిక ప్రకటనల ద్వారా, ఇతర ప్రచార మాధ్యమాల ద్వారా రైతులకు మార్కెట్ ధరలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు.

మార్కెట్ యార్డుల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటూ జిల్లా యంత్రాగం సహాయ సహకారాలతో మిర్చి కొనుగోళ్లను ప్రశాంతగా చేపట్టాలని సూచించారు. అడ్తిదారులతో, కొనుగోలు దారులతో, ఇతర మార్కెట్ వినియోగదారులతో అనునిత్యం సంప్రదింపులు జరిపి తద్వారా రైతులు గిట్టుబాటు ధర పొందేందుకు చొరవ చూపాలని అధికారులను ఆదేశించారు. మిర్చి రైతులు దగ్గర్లో ఉన్న కోల్డ్ స్టోరేజిలలో తమ సరుకు నిల్వచేసుకుని రెండు లక్షలవవరకూ రైతుబంధు పధకం ద్వారా రుణాలు పొందవచ్చని తెలిపారు. ఈ రుణాలకు ఆరు నెలలవరకూ వడ్డీ లేదని తెలిపారు. రైతులు ఈ అవకాశాలను ఉపయోగించుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ సమావేశంలో మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మిబాయి, ఏడి పి.రవికుమార్, వి.శ్రీనివాస్, వరంగల్ ప్రాంతీయ ఉప సంచాలకులు అజ్మీరా రాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News