Friday, December 20, 2024

బిఆర్‌ఎస్ నెం.1… రెండో స్థానంలో ఆప్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : భారతదేశంలో ప్రాంతీయ పార్టీలకు విరాళాలకు సంబంధించి 2021 -2022 ఆర్థిక సంవత్సరంలో భారతరాష్ట్ర సమితి పార్టీ(బిఆర్‌ఎస్) దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఆ పార్టీకి మొత్తం రూ.40. 9 కోట్లు విరాళాల రూపంలో అందాయి. ఆ తర్వాత రెండో స్థానంలో ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీకి రూ. 38.2 కోట్లు విరాళాల రూపంలో అందినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్ (ఎడిఆర్ ) ఈ గణాంకాలను వెల్లడించింది. దేశంలోని ప్రాంతీయ పార్టీల్లో బిఆర్‌ఎస్, ఆప్ తర్వాత జెడిఎస్‌కు అత్యధిక విరాళాలు అందాయి. ఆ పార్టీకి రూ. 33.2 కోట్లు డోనేషన్ల రూపంలో వచ్చినట్లు ఎడిఆర్ నివేదికలో వెల్లడైంది.

అలాగే సమాజ్ వాదీ పార్టీకి రూ. 29.7 కోట్లు, వైఎస్‌ఆర్‌సిపికి రూ. 20 కోట్ల విరాళాలు అందినట్లు ఎడిఆర్ నివేదికలో పేర్కొంది. ఆయా పార్టీలు ఎన్నికల సంఘానికి సమర్పించిన వివరాల ఆధారంగా ఎడిఆర్ ఈ గణాంకాలు వెల్లడించింది. దేశంలోని మొత్తం 26 ప్రాంతీయ పార్టీలకు రూ.189.8 కోట్లు అందినట్లు నివేదికలో పేర్కొంది. వీటిలో రూ.162.21 కోట్ల విరాళాలు ఐదు పార్టీలే అందుకున్నట్లు తెలిపింది. అయితే ఎఐఎడిఎంకె, బిజెడి, ఎన్‌డిపిపి, ఎన్‌డిఎఫ్, ఎఐఎఫ్‌బి, పిఎంకె, జెకెఎన్‌సి పార్టీలు తమకు అందిన విరాళాల వివరాలను వెల్లడించలేదు. కాగా.. ప్రాంతీయ పార్టీగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్నికల సంఘం ఈ నెలలోనే జాతీయ పార్టీగా గుర్తింపును ఇచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News