Sunday, January 19, 2025

24 వరకు ధాన్యం సేకరణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలం రై తులు పండిచిన ధాన్యం సేకరణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ప్రభుత్వం ఈసారి రైతుల నుంచి రి కార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసింది. రైతులకు ఎ క్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్ల కా ర్యక్రమాన్ని నిర్వహించింది. మొత్తం 64.30 లక్షల మెట్రి క్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇందుకొసం రైతులకు రూ.13750కోట్లు చెల్లించింది. 9.76లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు ఈ నిధులు జమ చేసిం ది. శనివారం మంత్రుల నివాస సముదాయంలో ్లధాన్యం కొనుగోళ్ల కార్యక్రమంపై ఉన్నతస్థాయి అధికారులతో స మీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి గంగల మాట్లాడుతూ రికార్డు స్థాయిలో సజావుగా వానాకాలం ధాన్యం కొనుగోళ్లు పూర్తిచేశామని వెల్లడించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం సకల ఏ ర్పాట్లు చేసిందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ దార్శనిక వి ధానాలతో తెలంగాణలో పంటల విప్లవం పుట్టుకొచ్చిందన్నారు. 7024 కొనుగోలు కేంద్రాల ద్వారా 13,750 కో ట్ల విలువ గల 64.30 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ చే శామన్నారు. 9లక్షల 76వేల మంది రైతులు తమ ధాన్యా న్ని కనీస మద్దతు ధరకు విక్రయించుకోగలిగారన్నారు.

వానాకాలం లేటుగా నాట్లేసిన వరికోతలు ఆల స్యం అయినందువల్ల తమ ధాన్యం అమ్ముకోవడానికి ఈ నెల 24వరకూ అవకాశం కల్పించినట్టు వెల్లడించారు. అ త్యధికంగా నిజామాబాద్, అత్యల్పంగా అదిలాబాద్ జిల్లా ల్లో ధాన్యం కొనుగోలు చేసినట్టు వివరించారు.ముఖ్యమం త్రి కెసిఆర్ అనుసరిస్తున్న వ్యవసాయ అనుకూల విధానాలతో ధాన్యం సేకరణ ఏఏటికాయేడు పెరిగిపోతోందన్నా రు. ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గదర్శనంలో రైతులకు చిన్న ఇబ్బందులు కూడా తలెత్తకుండా అత్యాద్భుతంగా వానాకాలం ధాన్యం కొనుగోళ్లు చేశామన్నారు. అక్టోబర్ 21న ప్రారంభమైన వానాకాలం పంట సేకరణ మూడు నెలల కు పైగా 94 రోజులు నిరంతరాయంగా నిర్వహించామని, మారుమూల ప్రాంతాల రైతులు సైతం రవాణా కోసం వెతలు పడకుండా, వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అందుబాటులోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసామన్నారు. రాష్ట్రంలో 7024 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసామని, వీటి ద్వారా 13,570 కోట్ల విలువ గల 64.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 9 లక్షల 76వేల మంది రైతుల నుండి సేకరించామన్నారు.

ఓపీఎంఎస్లో నమోదైన 12,700 కోట్లను చెల్లించామని మిగతావారికి సైతం వారం రోజుల్లోనే డబ్బులు అందజేస్తామన్నారు . అత్యధిక ధాన్యం సేకరణ కోసం ఎక్కడా గన్నీ బ్యాగుల కొరత లేకుండా వ్యయ ప్రయాసల కోర్చి గన్నీలను సేకరించామని, 16 కోట్ల గన్నీలు వాడగా ఎంత ధాన్యం వచ్చినా సేకరించేందుకు అనువుగా మరో ఐదున్నర కోట్ల గన్నీలు అధనంగా సమకూర్చుకున్నామన్నారు. రాష్ట్రంలో యాసంగి నాట్లు ప్రారంభమైనందున గత వానాకాలంలో లేటుగా నాట్లేసిన వారికి సైతం ఈనెల 24 వరకూ ధాన్యం అమ్ముకోవడానికి అవకాశం ఉందని, రైతులు ఈ అవకాశాన్ని వాడుకొని తమ ధాన్యాన్ని అమ్ముకోవాలన్నారు. 2014లో కేవలం 24.29 లక్షల మెట్రిక్ టన్నుల నుండి నేడు దేశంలో పంజాబ్ తర్వాత అత్యధికంగా వరి ధాన్యం సేకరించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. 2014–15లో 11.04 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్న వానాకాలం ధాన్యం సేకరణ గతేడాది వరకూ 70.44 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకోవడం తెలంగాణలో అమలవుతున్న రైతు సంక్షేమ ప్రభుత్వానికి నిదర్శనమన్నారు.

ఈ ఏడు బహిరంగ మార్గెట్లలోనూ ధాన్యానికి అత్యధిక ధర లభించడం సంతోషకర పరిణామమన్నారు. ఈ వానాకాలంలో అత్యధికంగా నిజమాబాద్‌లో 5.86 లక్షల మెట్రిక్ టన్నులు, కామారెడ్డిలో 4.75 లక్షల టన్నులు, నల్గొండలో 4.13లక్షల టన్నులు, మెదక్ 3.95లక్షల టన్నులు, జగిత్యాలలో 3.79 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించగా ,అత్యల్పంగా ఆదిలాబాద్లో 2264 మెట్రిక్ టన్నులు, మేడ్చల్లో 14361, ఆసిఫాబాద్లో 21548, రంగారెడ్డి 22164, గద్వాల్లో24181 మెట్రిక్ టన్నులు సేకరించామన్నారు, ఈ ధాన్యం సీఎంఆర్ ప్రక్రియ సైతం వేగంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రికార్డు స్థాయిలో సుధీర్ఘంగా జరిగిన ధాన్యం కొనుగోల్లకు సహకరించిన రైతులకు, హమాలీలు, ప్యాక్స్, ఐకేపీ యంత్రాంగం, సివిల్ సప్లైస్ అధికారులకు ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ అభినందనలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్ కుమార్, జాయింట్ కమిషనర్ ఉషారాణి, సివిల్ సప్లైస్ కార్పోరేషన్ జీఎం రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News