Monday, December 23, 2024

గృహలక్ష్మి లబ్ధిదారుల ఎంపిక యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలి: కలెక్టర్ అనుదీప్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గృహలక్ష్మి పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను అదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్పెషల్ ఆఫీసర్స్, తాశీల్దార్లతో గృహలక్ష్మిపథకంతో పాటు జిఓనెం.58,59 ల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూగృహలక్ష్మిపథకానికి సంబంధించి హైదరాబాద్ జిల్లాలో 15 నియోజకవర్గాల పరిధిలో ప్రతి నియోజకవర్గము నుండి 3వేల మంది చోప్పున లబ్ధిదారుల ఎంపిక ను త్వరగా పూర్తి చేయాలని అదేశించారు.

అదేవిధంగా గృహలక్ష్మి దరఖాస్తుదారులను ఎప్పటికప్పుడు పరిశీలించి అర్హులైన వారిని గుర్తించి పోర్టర్ లో నమోదు చేయాలని అన్నారు. గృహలక్ష్మి దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలనలో రేషన్ కార్డ్ ,ఓటర్ ఐడి ,ఆధార్ కార్డ్ ,హౌస్ సైట్, రేకుల షెడ్ లను ప్రామాణికంగా తీసుకోవాలని సూచించారు. .జి ఓ నంబర్.58,59,లో పెండింగ్ లో ఉన్న రిజిస్ట్రేషన్ ను త్వరతగతిన పూర్తి చేయాలని అన్నారు . జి ఓ 59 కు సంబంధించి ఆమోదించిన లబ్ధిదారులు చెల్లించాల్సిన డబ్బులను వెంటనే చెల్లించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా తహశీ ల్దార్లను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుసూదన్, డిఆర్వో వెంకటాచారి, స్పెషల్ ఆఫీసర్లు మండల తాసిల్దార్లు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News