Monday, December 23, 2024

జిల్లా పరిపాలనపై కలెక్టర్ అనుదీప్ ప్రత్యేక దృష్టి

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో: జిల్లా పరిపాలనపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పూర్తి స్థాయి దృష్టి సారించారు. సుదీర్ఘ కాలంగా జిల్లా పూర్తి స్థాయి కలెక్టర్ లేకపోవడం పక్క జిల్లాలైన రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్లే ఇంఛార్జీ కలెక్టర్ వ్యవహారించడంతో జిల్లా అభివృద్దితో పాటు ప్రజా సమస్యలు సైతం పెండింగ్‌లో పడ్డాయి. ఇదే క్రమంలో గత నెల 15న జిల్లాకు పూర్తి స్థాయి కలెక్టర్‌గా యువ ఐఎఎస్ అధికారి అనుదీప్ దురిశెట్టి బాధ్యతలు స్వీకరించడం, .గడచిన 30రోజుల్లో ఆయన జిల్లా పరిపాలనపై పూర్తి దృష్టి సారించాడమే కాకుండా వివిధ విభాగాలను చక్కదిద్దే పనిలో నిమగ్నం కావడంతో ఇప్పుడిప్పుడే జిల్లాలో ఓ గాడిలో పడుతోంది. ఇదేక్రమంలో వైద్యం, విద్య, ప్రజావాణి, గృహలక్ష్మి, మైనార్టీ బంధు, బిసి బంధు, డబుల్ బెడక్ రూం ఇళ్ల లబ్దిదారుల ఎంపిక, 59జిఓతో పాటు నోటరీ స్థలాల క్రమబద్దీకరణపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు.

ఇందులో భాగంగా నగరంలోనిపలు అర్భన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అకస్మికంగా తనిఖీలు నిర్వహించడమే కాకుండా అక్కడ రోగులకు అందతున్న సేవలను ఆరా తీస్తున్నారు. అంతేకాకుండ ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు సకాలంలో సరైన వైద్యం అందించేలా వైద్యులకు దిశా నిర్దేశనం చేస్తున్నారు. అంతేకాకుండా ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు మొదలు ఏలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని వైద్యులకు సూచిస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా విద్యా ప్రమాణాలను అందించడమే లక్షంగా ప్ర భుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మన బస్తీ, మనబడి కార్యక్రమంలో భాగంగా నగరంలోని చేపట్టిన వివిధ పాఠశాలల అభివృద్ధి పనులను పర్యవేక్షించే వారే లేకపోవడంతో అధికారులు వాటి పట్టించుకోకపోవడంతో చాలా పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి.

ఇదేక్రమంలో నూతన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గత రెండు వారాలుగా పాఠశాల అభివృద్ది పనులపై స్పెషల్ పోకస్ పెట్టడమే కాకుండా ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా చిన్న చిన్న పనులు సైతం పెండింగ్‌లో ఉండడంతో విద్యాశా ఖ అధికారులు ఇంజనీర్లపై తీవ్ర అగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా సమిక్ష సమావేశం నిర్వహించి మొదటి దశ కింద చేపట్టిన అన్ని పాఠశాల అభివృద్ది పనులను యుద్ద ప్రతిపాదికన పూర్తి చేయాలని అదేశాలను జారు చేశారు. అదేవిధంగా స్థలం ఉండి డబ్బులు లేక ఇళ్లు కట్టికోలేని వారి కోసం ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన గృహాలక్ష్మి పథకంపై సైతం కలెక్టర్ అత్యత ప్రాధాన్యతను ఇస్తున్నారు. గృహాలక్ష్మి కింద వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిశీలించి ఈనెల 23 నాటికి అర్హులను గుర్తించాలని అధికారులను అదేశించారు. అదేవిధంగా సుదీర్ఘ కాలంగా డబులు ఇళ్ల కోసం నిరుపేదలు ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.. అయితే ఇందుకు సంబంధించి లబ్దిదారుల గుర్తింపు ఇటీవల వరకు నత్త నడకన కొనసాగగా, కొత్త కలెక్టర్ వచ్చిన నెల రోజుల లోపు సర్వేను పూర్తి చేయించడమే కాకుండా అర్హుల జాబితాను తేల్చారు.

అంతేకాకుండా ఈనెల 24న జిల్లా కలెక్టరేట్‌లో డ్రా పద్దతిలో 12 వేల లబ్దిదారులను గుర్తించి వారికి సెప్టెంబర్ 2నడబుల్ బెడ్ రూం ఇళ్లను అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వీటితో పాటు గత 8 ఏళ్లుగా ప్రవాసంగా కొనసాగుతున్న జిఓ 59 కింద ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణ అంశంపై సైతం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి దృష్టి సారించారు. అదేవిధంగా కరోనా మొదలు కలెక్టరేట్‌లో నిలిచిపోయినా ప్రజావాణిని ఇక మీదట ప్రతి సోమవారం నిర్వహించేలా చర్యలు తీసుకోవడంతో పాటు తద్వారా అందిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాల్సిందిగా అధికారులకు అదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా తల్లిదండ్రుల పోషణ పట్టించుకోని పుత్రరత్నాలపై సంగతి తేల్చేందుకు ఇందుకు సంబంధించి ఫిర్యాదులపై ప్రతి శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లో విచారణ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News