Wednesday, January 22, 2025

ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన కలెక్టర్

- Advertisement -
- Advertisement -

నారాయణపేట ప్రతినిధి: ఎరువులు కొనుగోలు చేసేందుకు రైతులు తప్పనిసరిగా ఆధార్ కార్డులు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో శుక్రవారం ఎరువుల దుకాణాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పట్టణంలోని మన గ్రోమోర్ సెంటర్ , గణేష్ ట్రైడర్స్ దుకాణాలను తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఐఎఫ్‌ఎంఎస్ స్టాక్ పొజిషన్ సంబంధించిన ఫిజికల్ స్టాక్ పొజిషన్‌ను దృవీకరించారు. ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ మిషన్‌లో ద్వారా మాత్రమే విక్రయించాలని డీలర్‌కు సూచించారు. డీలర్లు బ్లాక్ మార్కెటింగ్ ఆశ్రయించరాదని హెచ్చరించారు. అన్ని ఎరువులను గరిష్ట చిల్లర దొర ప్రకారమే విక్రయించాలని ఆదేశించారు.

అవసరాన్ని బట్టి ఎవురులు నిల్వ చేసుకోవాలని సూచించారు. ఎరువులు కొనేందుకు రైతులు తప్పనిసరిగా ఆధార్ కార్డు వెంట తీసుకురావాలని కలెక్టర్ తెలిపారు. ఎరువులకు సంబంధించిన పూర్తి వివరాలు బోర్డుపై ప్రదర్శించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయాధికారి జాన్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News