ముశిపట్ల గ్రామాన్ని సందర్శించి పనుల పరిశీలన
మన తెలంగాణ/మోత్కూరు: మోత్కూరు తహసీల్దార్, మండల పరిషత్ కార్యాలయాలను శుక్రవారం యాదాద్రి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓటరు నమోదును, ధరణీ రిజిస్ట్రేషన్లను పరిశీలించారు. ఓటరు నమోదు, ఓటర్ల వివరాలను పకడ్బందీగా పూర్తి చేయాలని సూచించారు. పెండింగ్ లో ఉన్న పనులను అడిగి తెలుసుకుని రికార్డులు పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పనులు పూర్తి చేయాలని చెప్పారు. అనంతరం మండలంలోని ముశిపట్ల గ్రామాన్ని సందర్శించి హరితహారం, శ్మశాన వాటిక, డంపింగ్ యార్డును పరిశీలించారు. డంపింగ్ యార్డును ఏ విధంగా ఉపయోగిస్తున్నది పంచాయతీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సేంద్రీయ ఎరువు తయారు చేస్తున్నారా అని సిబ్బందిని అడగ్గా సేంద్రీయ ఎరువును కొంత మొక్కలకు వేస్తున్నామని, మిగతాది అమ్ముతున్నామని తెలిపారు. హరితహారం లక్ష్యం మేరకు మొక్కలను సంరక్షించి పెంచాలన్నారు. తహసీల్దార్ రాంప్రసాద్, ఎంపీవో రవూఫ్ అలీ, పంచాయతీ కార్యదర్శి క్రాంతి ఆయన వెంట ఉన్నారు.
Also Read: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై భారత్ వైఖరి సరైనదే