Friday, January 24, 2025

మున్సిపల్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మోత్కూరు: మోత్కూరు మున్సిపల్ కార్యాలయాన్ని గురువారం యాదాద్రి కలెక్టర్ పమేలాసత్పతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మోత్కూరులో వైద్యశాఖ ఆధ్వర్యంలో ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులు పరిశీలించారు. సోలిపురం దామోదర్‌రెడ్డి ఇంటి నిర్మాణం వివాదంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా కమిషనర్ ను అడిగి అందుకు సంబంధించిన వివరాలు తెలుసుకుని ఫైల్‌ను పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ సి.శ్రీకాంత్ ఆమె వెంట ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News