Sunday, January 19, 2025

కరోనా టీకా కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ,సిటీబ్యూరో: కంటోన్మెంట్ ప్రాంతంలోని రసూల్‌పుర పోలీసు ట్రైనింగ్ సెంటర్, గన్‌బజార్ కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన కరోనా టీకా కేంద్రాలను జిల్లా కలెక్టర్ శర్మన్ సందర్శించారు. బుధవారం వ్యాక్సినేషన్ సెంటర్‌ల ఏర్పాటు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈకేంద్రాల్లో ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయిన పోలీసు సిబ్బంది, 60 సంవత్సరాలు నిండిన వారికీ, 15 నుండి 18 సంవత్సరాల లోపు వారికి ఈ కేంద్రాలలో టీకా వేస్తున్నట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. అనంతరం బోయిన్‌పల్లి యుపిహెచ్‌సీ సందర్శించి అక్కడ టీకా కార్యక్రమాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే నాదృష్టికి తీసుకురావాల్సిందిగా కోరారు. అనంతరం ముషీరాబాద్‌లోని యుపిహెచ్‌సి వ్యాక్సినేష్ సెంటర్ సందర్శించారు. అక్కడి ఏర్పాట్లు గురించి అధికారులను కలెక్టర్ అడిగి తెలుకుని ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. బూస్టర్ డోసుపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యాక్సిన్ వేయించుకోవడానికి వచ్చిన వారితో కలెక్టర్ మాట్లాడుతూ బంధువులు, స్నేహితులను టీకా వేయించుకునేలా చైతన్య పరచాలన్నారు. ఈకార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News