Saturday, November 9, 2024

విశ్వ విద్యాలయం వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను పరిశీలించిన కలెక్టర్

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట రూరల్: ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం వ్యవసాయ పాలిటెక్నిక్ ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పా టిల్ పరిశీలించారు. శుక్రవారం సిద్దిపేట రూరల్ మండలం తో ర్నాల గ్రామ పంచాయతీ పరిధిలోని జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం వ్యవసాయ పాలిటెక్నిక్ వి ద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ప్రిన్సిపల్ సిద్దిపేట రిజన ల్ రింగ్ రోడ్డు విశ్వ విద్యాలయంకు కేటాయించిన భూమి పరిధిలో నుంచి వెలుతుందని దానివల్ల కళాశాలకు చాలా విభాగా ల్లో నష్టం చేకూరుతుందని ఇది వరకే కలెక్టర్ దృష్టికి తెచ్చామన్నారు. జిల్లా సర్వే లాండ్ ఎడి వినయ్ కుమార్, ఆర్‌అండ్‌బి ఇ ంజనీరింగ్ అధికారులు ఎస్‌ఆర్‌ఆర్ వెలుతున్న క్రమాన్ని మ్యాప్ ద్వారా కలెక్టర్‌కు చూపించారు.

అనంతరం ఎస్‌ఆర్‌ఆర్ మార్గాన్ని విశ్వ విద్యాలయ మధ్యలో ఉండడం వల్ల ఇబ్బంది ఉంటుందని మధ్యలో కాకుండా చివరి నుండి వెళ్లేలా క్షేత్రస్థాయిలో పరిశీలించిన ప్రణాళికలు రూపోందించాలని అధికారులు, రూరల్ తహశీల్దార్, సర్వేయర్, ప్రిన్సిపాల్ గ్రామ ప్రజాప్రతినిధులకు సూచించారు. ఇలా చేయడం వల్ల ఎవ్వరికి నష్టం ఉండదన్నారు. మంత్రి హరీశ్ సమక్షంలో చర్చించి ఒక నిర్ణ యం తీసుకుంటామన్నారు. మెదక్, సిద్దిపేట నేషనల్ హైవే ప నులు ముమ్మరంగా సాగుతున్నందున నేషనల్ హై వే, ఎస్‌ఆర్‌ఆర్ కలిసే ప్రాంతంలో పెద్ద రింగ్ మాదిరి రోడ్డు ని ర్మాణం వల్ల అందరికి సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. కలెక్టర్ వెంట కళాశాల సిబ్బంది, అధికారులు, రూరల్ తహశీల్దార్ శ్రీనివాస్, గ్రామ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News