Thursday, January 9, 2025

గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షా కేంద్రాలను తనిఖీచేసిన కలెక్టర్

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ బ్యూరో : తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్‌పిఎస్‌సి) ద్వారా ఆదివారం జరిగిన గ్రూప్-_1 ప్రిలిమ్స్ పరీక్షా కేంద్రాలను కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు తనిఖీ చేశారు. ఆదర్శ హిందీ విద్యాలయ (హరిచరణ్ మార్వాడీ) కళాశాలతో పాటు పద్మానగర్‌లోని విశ్వశాంతి జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్ష నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. అభ్యర్థుల హాజరు, సిబ్బంది హాజరు గురించి ఆరా తీశారు. నిబంధనలకనుగుణంగా నిర్ణీత సమయంలో ప్రశ్నాపత్రాలను తెరిచారా లేదా అనేది నిర్ధారణ చేసుకున్నారు.

పరీక్షా కేంద్రాల్లో గదులను సందర్శించి అభ్యర్థులకు అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించి ముఖ్య పర్యవేక్షకులకు పలు సూచనలు చేశారు. జిల్లాలో 62 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని, ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో మొత్తం 12861 మంది అభ్యర్థులక గాను 7957 మంది హాజరయ్యారని, 4904 మంది గైర్హాజరయ్యారని వివరించారు. కలెక్టర్ వెంట పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండ్ లైజనింగ్ అధికారులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News