- Advertisement -
విశాఖపట్నం: నగరంలోని రామానాయుడు స్టూడియోకి జిల్లా కలెక్టర్ నోటీసులు జారీ చేశారు. రామానాయుడు స్టూడియోకు చిత్ర నిర్మాణ పరిశ్రమ, స్టూడియో కోసం ప్రభుత్వం 34 ఎకరాలకు పైగా భూమిని కేటాయించిందని… అందులో 15.17 ఎకరాలు హౌసింగ్ లేఅవుట్ కోసం మార్పుల చేయాలని స్టూడియో యాజమాన్యం కోరిందని కలెక్టర్ అన్నారు. అది నిబంధనలకు విరుద్ధంగా ఉందని.. అందుకే నోటీసులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు. రెండు వారాల సమయం ఇస్తామని, వారి వివరణ తర్వాత చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.
- Advertisement -