Wednesday, January 22, 2025

కలెక్టర్ పమేలా సత్పతికి రాఖీ కట్టిన విద్యార్థులు

- Advertisement -
- Advertisement -

అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతిరూపం రక్షాబంధన్

మనతెలంగాణ/ఆలేరు, భువనగిరి కలక్టరేట్: స్వాంతంత్ర భారత వజ్రోత్సవాలలో బాగంగా శుక్రవారం ఆలేరు మండలం మందనపల్లి గ్రామంలో గల బ్యాక్ టూ బ్యాక్ బాల సంరక్షణ కేంద్రంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ బాల బాలికాలతో రాఖీ వేడుకలను ఘనంగా ఆనందోత్సవాలతో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పి ల్లలతో వజ్రోత్సవాల సందర్భంగా రాఖీ పండుగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని ఈ ప ం డుగ తెలియజేసేది మనకు మనం రక్షణ చర్యలు తీసుకుంటూ మన స్నేహితులకు రక్షణగా నిలబడట మే ముఖ్య ఉద్దేశమని ఇది అన్న చెల్లెల అనుభంధానికి ప్రతి రూపం అని ప్రతి ఒక్కరూ తమ తమ ల క్ష్యాలను చేరుకోవడానికి పట్టుదలతో కృషి చేసినపుడే మీ లక్ష్యాలను సాధించగలుగుతారని కలెక్టర్ తెలిపారు.

స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ మాట్లాడుతూ బాలలందరూ తనకు రాఖీ కట్టడం చాలా ఆనందాని ఇచ్చిందని, పిల్లలందరూ సోదర భావంతో 75వ సం.రాల స్వాతంత్ర భారత ఫలాలను పొందాలని ఇది చదువుతో సాధ్యం అవుతుందని , పిల్లలందరూ కష్టపడి చదివి తమ భవిష్యత్తును తానే నిర్ణయించుకోవాలని , చెడు అలవాట్లు, చెడు సావాసాలు చేయకుండా చదువు పై ద్యాస ఉంచాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాలల సంక్షేమ సమితి ఛైర్మన్ బండారు జయశ్రీ, సభ్యులు కె.మల్లేషం, జిల్లా బాలల పరిరక్షణ అధికారి పి.సైదులు, స్థానిక గ్రామ సర్పంచ్ కె.పండరి, ఎంపిడివో జ్ఞాన ప్రకాష్, ఎంపిఓ సలీం, ఆశ్రమ నిర్వాహకులు దేవదాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News