Friday, January 31, 2025

పథకాల అమలులో అగ్రస్థానంలో నిలపాలి

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట అర్బన్: పథకాల అమలులో జిల్లాను అగ్రస్థానంలో నిలిపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అన్నారు. బుదవారం జగిత్యాల జిల్లా నూతన కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి జగిత్యాల వెలుతున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ను జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ములుగు మండలం వంటిమామిడి వద్ద స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సిద్దిపేటలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, కమిషనర్ శ్వేతతో కలిసి ఆల్పాహారం తీసుకున్న అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లాలో జరుగుతున్న పాలనాపరమైన విషయాలు, ప్రభుత్వ పథకాలు అమలు గూరించి చర్చించారు. పథకాల అమలులో అగ్ర స్ధానంలో నిలిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా జిల్లా అదనపు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మర్యాదపూర్వకంగా కలిశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News