సిద్దిపేట: పాత ఆటోనగర్‌లో ఉన్న షాప్ ఓనర్లకు మాత్రమే అర్హులని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని చాంబర్‌లో ఆటోనగర్ యూనియన్ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మంత్రి హరీశ్‌రావు రాష్ట్రంలోనే ఆదర్శంగా ఉండేలా 50 కోట్ల రూపాయల విలువైన 25 ఎకరాల స్థ్ధలంలో 15 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో చేపడుతున్న మోడల్ ఆటోనగర్‌లో నిర్మాణం తుది దశకు చేరుకున్నాయన్నారు. టిఎస్‌ఐఐసీ సంస్ధవారు పరశ్రమలకు లీజ్ పద్ధ్దతిలో అందజేస్తారని ట్రేడ్ లైసెన్స్, పోటో కాఫితో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.
సకల సౌకర్యాలతో అత్యంత అధునాతన పద్దతిలో తీర్చిదిద్దుతున్నందున ఇట్టి ప్లాట్లకు డెవలప్‌మెంట్ రుసుం మాత్రమే చెల్లించి యజమానుల పేరిట రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ఎమైన సమస్యలు ఉంటే మంత్రి హరీశ్‌రావు సమక్షంలో చర్చించి అందరికీ న్యాయబద్దమైన నిర్ణయం తీసుకుంటామని హమీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిఎస్‌ఐఐసి జ్యోతి, రాష్ట్రమెడికల్ బోర్డు సభ్యులు పాల సాయిరాం తదితరులు పాల్గొన్నారు.