Friday, December 20, 2024

ఇరిగేషన్ ఉన్నతాధికారులతో కలెక్టర్ సమీక్ష

- Advertisement -
- Advertisement -

నాగార్జునసాగర్:హిల్ కాలనీలోని విజయవిహార్‌లోని కాన్పరెన్స్‌హాల్‌లోనాగార్జునసాగర్ డ్యామ్, డిండి లిప్ట్ ఇరిగేషన్ ఎస్.ఎల్.బిసి ప్రాజెక్టుల ఉన్నతాధికారులతో నల్గొండ జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మంగళవారం నాడు సమీక్ష సమావేశం నిర్వహించారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలో ఉన్న మూడు ప్రాజెకుఏ్టలైన నాగార్జునసాగర్, డిండి, లిప్ట్ ఇరిగేషన్ ఎస్.ఎల్.బి.సి ప్రాజెక్టుల వివరాలను ఇరిగేషన్ అధికారులు కలెక్టర్‌కు వివరి ంచడం జరిగింది.

అనంతరం కలెక్టర్ కర్ణన్ మాట్లాడుతూ ప్రాజెక్టులకు సం బంధించిన ఎలాంటి సమస్యలున్నా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.అనంతరం ఎన్‌ఎస్పీ సీ.ఈ అజయ్‌కుమార్ మాట్లాడుతూ ఎన్‌ఎస్పీ అధీనంలో ఉన్న ఫారెస్టు రెవిన్యూ సమస్యలేవైనున్న వాటిని త్వరతగతిన పూర్తిచేస్తామని తెలిపారు. స్పిల్ వే పనులు మరో పది రోజుల్లో పూర్తవుతుందని ఆయన తెలిపారు. అంతక ముందు కలెక్టర్ కర్ణన్ నాగార్జునసాగర్ ప్రధాన డ్యామ్ గ్యాలరీను సందర్శించారు.

ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్పీ ఎస్ ఈ నాగేశ్వరరావు, ఈఈ మల్లికార్జున, డీఈలు, సుదర్వన్, శ్రీనివాస్, ఏఈ లు కృష్ణయ్య, బిక్షం, జేఈఈ సత్యనారాయణ, పెద్దవూర తాసీల్థార్ సైదులుగౌడ్, డిటి చందు, ఎఫ్‌డిఓ సర్వేశ్వర్, ఎస్‌ఐ సురేష్, డ్యామ్ ఆర్‌ఐ భాస్కర్ మరియు మూడు ఇరిగేషన్ ప్రాజెక్టు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News