Thursday, January 23, 2025

టీనేజర్లు కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: జిల్లాలోని నాంపల్లి వనిత మహా విద్యాలయం, లక్డీకాపూల్‌లోని తపస్య కళాశాల్లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ సెంటర్లను కలెక్టర్ శర్మన్ సందర్శించారు. గురువారం 15 నుంచి 18 సంవత్సరాల లోపు పిల్లలందరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. కళాశాలలోని విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడుతూ.. కళాశాలలకు వచ్చే విద్యార్థులందరూ టీకా తీసుకోవాలని కళాశాలలకు హాజరుకానీ వారిని కూడా గుర్తించి వ్యాక్సిన్ తీసుకునేలా చర్యలు తీసుకోవాలని అధ్యాపకులకు సూచించారు. ఈకార్యక్రమంలో ఎస్‌పిహెచ్‌ఓ డా.నాగేందర్, కళాశాలల అధ్యాపకులు, విద్యార్ధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Collector Sharman visit Vaccination Centres in Lakdikapul

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News