Sunday, December 22, 2024

మల్లికార్జున స్వామి సన్నిధిలో కలెక్టర్ ప్రత్యేక పూజలు

- Advertisement -
- Advertisement -

కొమురవెల్లి: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సావాల్లో భాగంగా బుధవారం అధ్యాత్మిక దినోత్సవం పురష్కరించుకుని జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సతీసమేతంగా పాల్గొని ఆలయ సాంప్రదాయం ప్రకారం పూజలో పాల్గొని మల్లన్న స్వామిని దర్శించుకున్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడానికి కలెక్టర్ సతీ సమేతంగా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగానికి చేరగా ఆలయ పాలకవర్గం కలెక్టర్‌కి ఘనంగా స్వాగతం పలికారు. వేద పండితులు డప్పు వాయిద్యాల సన్నాయు మేళాల నడుమ పూర్ణకుంభంతో ఆలయంలోకి తిసుకేళ్ళారు.

ముందుగా వేద పండితుల నడుమ నిర్వహించిన రుద్రహోమం పాల్గోన్నారు. తర్వాత 108 కలశాల తోటి ఏర్పాటు చేసిన కలశ పూజను జ్వోతి ప్రచోదన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలయ గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు సమక్షంలో ప్రత్యేక ఆశీర్వచనాలు అందుకున్నారు. మల్లికార్జున స్వామి ఎంతో విశిష్టమైన పట్నం పూజలో పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ… అందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవం శుభాకాంక్షలు. అధ్యాత్మిక దినోత్సవం పురష్కరించుకుని రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్ట గల కొమురవెల్లి మల్లికార్జున స్వామి ని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. మంత్రి హరీశ్‌రావు మార్గనిర్దేశం తో జిల్లా రాష్ట్రంలోనే అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉంది. సాగు, తాగునీటికి ఎలాంటి కోరత లేకుండా రిజర్వాయర్ల ఖిల్లా మన జిల్లా జిల్లాలో ప్రజలందరూ ఆయురారోగ్యాలు అష్టా ఐశ్వర్యలతో, సుఖశాంతులతో వర్థిల్లాలని కోరుకుంటున్నాను. జిల్లాను ప్రగతి పథంలో నడపడానికి కృషి చేస్తున్న ప్రతి ఓక్కరికి జిల్లా పాలన యంత్రాంగం తరపున కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టర్ వెంట ఆలయ ఈఓ బాలాజి, చైర్మన్ గిస బిక్షపతి, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News