Saturday, December 21, 2024

కలెక్టర్ వరుణురెడ్డి సుడిగాలి పర్యటన

- Advertisement -
- Advertisement -

భైంసా :కలెక్టర్ వరుణ్ రెడ్డి భైంసా పట్టణంతో పాటు భైంసా మండలంలో మంగళవారం సుడిగాలి పర్యటన నిర్వహించారు. అంతేగాకుండా పట్టణ సమీపంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టును సైతం సందర్శించారు. ప్రాజెక్టు పూర్తి వివరాలను అధికారులను అడిగి ఆరా తీశారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు మొత్తం నీటి మట్టం 1.852 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.574 టీఎంసీల నీరు నిల్వ ఉందని 6500 క్యూసెక్కుల ఇన్‌ప్లో రాగా అదే రీతిలో 8450 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతంలో సుద్దవాగులోకి వదిలేస్తున్నట్లు చెప్పారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ సూచనలుండగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి మంగళవారం నిర్వహించే డ్రైడే సందర్భంగా మండలంలోని ఖత్‌గాం గ్రామాన్ని జిల్లా పాలనాధికారి వరుణ్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించి గ్రామంలోని మొక్కలను డంపింగ్ యార్డును పరిశీలించారు. కలెక్టర్ వీధుల్లో పర్యటిస్తూ వర్షాలతో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

ఎక్కడ కూడా నీరు నిల్వ ఉండకుండా తగు చర్యలు చేపట్టాలన్నారు. కాల్వలో చెత్తా చెదారం వేయకుండా శుభ్రంగా ఉంచుకునేలా అధికారులు, వైద్య సిబ్బందిగ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ కూలర్లు , టైర్లు, కుండీలలో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి పిల్లలతో మాట్లాడారు. క్రీడా ప్రాంగణం, పల్లె ప్రకృతి వనం సందర్శించి ఆనందం వ్యక్తం చేశారు. పట్టణంలో మున్సిపల్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వివేకానంద చౌరస్తా, మార్కెట్ ఏరియాలో పనులను పరిశీలించారు. ప్రాజెక్టు గేట్లను సైతం పరిశీలించారు. లోతట్టు ప్రాంతాలపై గట్టి నిఘా ఉంచాలని ఆదేశించారు.

సిద్దూర్ గ్రామాన్ని సైతం కలెక్టర్ సందర్శించారు. ఆయన వెంట డీఎల్‌పీవో శివకృష్ణ, ఎంపీడీవో గోపాల కృష్ణా రెడ్డి, ఎంపీవో మోజమ్ హుస్సెన్, తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డితో పాటు పట్టణంలో కమిషనర్ వెంకటేశ్వర్లు, డీఈ నాగేశ్వర్ రావు, ఏఈ యాకుబ్ అలీ, ఇరిగేషన్ డీఈ అనిల్, ఏఈ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News