Monday, December 23, 2024

పార్వతి బ్యారేజీని సందర్శించిన కలెక్టర్

- Advertisement -
- Advertisement -

మంథని: మండలంలోని సిరిపురంలోని పార్వతి బ్యారేజీని శుక్రవారం జిల్లా ప్రత్యేక అధికారి సంగీత సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సందర్శించారు. పార్వతి బ్యారేజ్‌కు వస్తున్న వరద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల పార్వతి బ్యారేజ్‌కు 8.80 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని, బ్యారేజీ 74 గేట్లు తెరిచి వరదను దిగువకు విడుదల చేస్తున్నామని అధికారులు వివరించారు

. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ దానికి అనుగుణంగా దిగువ ప్రాంతాలను అలర్ట్ చేయాలని ప్రత్యేక అధికారి, జిల్లా అధికారి సూచించారు. ఈ పర్యటనలో కాలేశ్వరం ప్రాజెక్టు ఈఎన్‌సీ నల్ల వెంకటేశ్వర్లు, ఎస్‌ఈ కరుణాకర్, ఈఈ ఓంకార్ సింగ్, డీఈ లక్ష్మీనారాయణతోపాటు పలువురు అధికారులు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News