Monday, December 23, 2024

ఈవిఎం, వివి ప్యాడ్లను పరిశీలించిన కలెక్టర్

- Advertisement -
- Advertisement -

వికారాబాద్ : జిల్లాలో రాబోయే ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఉపయోగించే ఈవీఎంలు, వివి ప్యాడ్స్, కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్ల మొదటి స్థాయి తనిఖీని సోమవారం స్థానిక తహసిల్దార్ కార్యాలయం పక్కన గల ఈవీఎం గోడౌన్‌లో భద్ర పరిచిన ఓటింగ్ యంత్రాలను జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి పరిశీలించారు. అదేవిధంగా వికారాబాద్ పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో గల స్ట్రాంగ్ రూములను, అదేవిధంగా ఎన్నికల ప్రక్రియ నిమిత్తం ఉపయోగించుకునే దిశగా మేరీ నాట్ స్కూల్, శ్రీ అనంతపద్మనాభ కళాశాల భవనాలను, పరిసరాలను అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, ఆర్డీవో విజయ్ కుమారి, తహసీల్దార్ రవీందర్‌రెడ్డిలతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి పరిశీలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News