Wednesday, January 22, 2025

మన ఊరు మన బడి కింద మంజూరైన భవనాలను పరిశీలించిన కలెక్టర్

- Advertisement -
- Advertisement -

వెల్దురి: మండలంలోని మన ఊరుమన బడికింద మంజూరైన భవనాలను కలెక్టర్ రాజర్షి షా శుక్రవారం పరిశీలించారు. మండలంలోని కుకునూరు, వెల్దుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భవనాలను సందర్శించిన అనంతరం మాట్లాడుతూ వెల్దుర్తి జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన భోజన శాలను పరిశీలించారు.

భోజనశాల చాలా విశాలంగా ఉందని ఆయన అన్నారు. వెల్దుర్తి జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో 639 విద్యార్థిని, విద్యార్థినిలు విద్యను అభ్యసించడం పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

ముఖ్యంగా పాఠశాలలో పనిచేస్తు న్నటువంటి ప్రదానోపాధ్యాయుడు సాంబయ్యను ప్రశంసించారు. జడ్పీహెచ్‌ఎస్, ఎంపీపీఎస్ పాఠశాలలు మౌలిక సదుపాయాలు ఉన్నాయని ఇంకా ఏమైనాఅవసరం ఉంటే మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తామన్నారు. మన ఊరు మన బడి కింద నిర్మించిన భవనాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటలక్ష్మమ్మ, మాజీ జడ్పీటీసీ అంజనేయులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News