Monday, April 28, 2025

ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ సతీమణి ప్రసవం

- Advertisement -
- Advertisement -

జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష దంపతులకు మరో వారసుడొచ్చాడు. గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కలెక్టర్ భార్య విజయకు ప్రభుత్వ వైద్యులు ప్రసవం చేయడంతో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఏరియా ఆసుపత్రికి సంబంధించిన సీనియర్ వైద్యురాలు అరుణ నేతృత్వంలో శిరీష, లక్ష్మి, వైద్య బృందం ఆమెకు శస్త్ర చికిత్సలు చేసి పురుడు పోశారు. కలెక్టర్ భార్య విజయ గర్భవతిగా ఉన్నప్పటి నుండి గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్య సేవలను పొందుతున్నారు. ప్రతి నెలా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు.

ఆమెకు ఇది రెండో సంతానం, మొదటి సంతానంలో కుమారుడికి జన్మనివ్వగా, మళ్లీ రెండవ సంతానంలో కూడా కొడుకు పుట్టాడు. ఈ సందర్భంగా వైద్యులకు శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్, తన ఆనందాన్ని అందరితో పంచుకుంటూ వారికి అభినందనలు తెలిపారు. నిరుపేదలకు కూడా తమ సేవను మరింత వినియోగించేలా కృషి చేయాలని వారిని ఈ సందర్భంగా కోరినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రతి ఒక్కరు వైద్య సేవలు పొదాలన్న ప్రభుత్వ నియమాన్ని ఆయన పాటించి చూపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎంతోమందికి ఆదర్శంగా నిలవడం పట్ల పలువురు అభినందనలు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News