Wednesday, January 22, 2025

హోంగార్డు శంకర్‌కు కలెక్టర్ ప్రశంస

- Advertisement -
- Advertisement -

కారేపల్లి : మండల పరిధిలోని చీమలపాడులో బిఆర్‌ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన సందర్భంగా గ్యాస్ సిలిండర్ పేలుడు సంఘటనలో హోంగార్డు శంకర్ చూపించిన తెగువకు కలెక్టర్ విపి.గౌతమ్ ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఇటీవల జరిగిన బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ప్రమాదవశాత్తు సిలిండర్ పేలిన ఘటనలో

పలువురిని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడిన కారేపల్లి పోలీస్ స్టేషన్ హోంగార్డు భూక్యా శంకర్‌కు జిల్లా కలెక్టర్ విపి.గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ ప్రశంస పత్రాన్ని అందజేశారు. ముందస్తు చూపుతో అధిక ప్రాణనష్టం జరగకుండా చూడటమే కాకుండా, అందరిని అప్రమత్తత చేసినందుకు హోంగార్డు శంకర్ ను ఈ సందర్భంగా కలెక్టర్ ,ఎస్పీ అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News