Monday, December 23, 2024

గోరికొత్తపల్లిలో కలెక్టర్ పర్యటన

- Advertisement -
- Advertisement -

రేగొండ: మండలం నుండి విడిపోయి నూతనంగా ఏర్పాటయిన గోరికొత్తపల్లి మండల కేంద్రంలో మంగళవారం భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, మండలాధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి కార్యాలయ మౌళిక వసతుల కోసం ఏర్పాట్లను మంగళవారం పరిశీలించారు. ఇప్పటికే గోరికొత్తపల్లి మండల కేంద్రంలో కార్యాలయాల తాత్కాలిక ఏర్పాట్ల కోసం కలెక్టర్ భవేశ్ మిశ్రా రెండుసార్లు పర్యటించారు.

మండల కేంద్రంలోని జడ్పిఎస్‌ఎస్ పాఠశాలను అధికారులు సూచించగా, పాఠశాలలో అనుకూలంగా ఉండే రూమ్‌లను పరిశీలించారు. ఆ తర్వాత తహసీల్దారు సత్యనారాయణ స్వామికి, ఎంపిడిఓ సురేందర్‌గౌడ్‌లకు పాఠశాల భవనంలో తాత్కాలికంగా మండల రెవెన్యూ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయం కోసం సిద్దం చేయగా కలెక్టర్ పరిశీలించి ఓకే చేసినట్లు తెలిసింది. అలాగే అన్ని కార్యాలయాలకు అనుకూలంగా ఉండే అద్దె భవనాలను చూడాల్సిందిగా తహసీల్దారు స్వామికి, సర్పంచ్ రజిత, ఎంపిటిసి హమీద్‌లకు సూచించారు.

గోరికొత్తపల్లి మండలాన్ని కొద్ది రోజుల్లో అధికారికంగా ప్రకటించేందుకు సిద్దమవుతున్న మండల కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. కలెక్టర్ వెంట స్థానిక తహసీల్దారు సత్యనారాయణ స్వామి, అధికారులు, బిఆర్‌ఎస్ యూత్‌నాయకులు సూదనబోయిన విష్ణు యాదవ్, ఎంపిటిసి హమీద్, మండల నాయకులు రఘుసాల తిరుపతి, తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News