Thursday, January 23, 2025

మా నమ్మకం నిజమైంది

- Advertisement -
- Advertisement -

శివ కార్తికేయన్ హీరోగా శిబి చక్రవర్తి దర్శకత్వంలో శివకార్తికేయన్ ప్రొడక్షన్స్‌తో కలిసి లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ‘కాలేజ్ డాన్’ చిత్రం ఇటీవల విడుదలైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్మాత ఎన్వీ ప్రసాద్ విడుదల చేసిన ఈ చిత్రం మీడియా మీట్ హైదరాబాద్‌లో జరిగింది.

ఈ సందర్భంగా హీరో శివ కార్తికేయన్ మాట్లాడుతూ “కాలేజ్ డాన్ చిత్రం అందరికీ నచ్చడం ఆనందంగా వుంది. దర్శకుడు శిబి చక్రవర్తి మొదట స్క్రిప్ట్ వినిపించినపుడు ఈ కథ అందరికీ నచ్చుతుందని అనుకున్నాం. మా నమ్మకం నిజమైంది”అని అన్నారు. సముద్రఖని మాట్లాడుతూ కాలేజ్ డాన్ చిత్రానికి తమిళ్‌లో ఎంత మంచి ఆదరణ లభించిందో తెలుగులో కూడా అంతే ఆదరణ లభించడం హ్యాపీగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్వీ ప్రసాద్, శిబి చక్రవర్తి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News