Wednesday, January 22, 2025

అబర్న్ యూనివర్సిటీతో అటవీ కళాశాల ఒప్పందం

- Advertisement -
- Advertisement -

ప్రతి ఏడాది ఎఫ్‌సిఆర్‌ఐ ఇద్దరూ విద్యార్థులకు మాస్టర్స్ డిగ్రీ

మనతెలంగాణ/ హైదరాబాద్ : అమెరికా అలబామా రాష్ట్రంలో ఉన్న ప్రముఖ యూనివర్సిటీ అబర్న్‌లో ఫారెస్ట్రీలో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం తెలంగాణ విద్యార్థులకు దక్కనుంది. ఫారెస్ట్ కాలేజీ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ లో బీఎస్సీ ఫారెస్ట్రీ చదివిన విద్యార్థుల్లో ప్రతీ యేటా ఇద్దరికి ఎమ్సెస్సీ ఫారెస్ట్రీ కోసం పూర్తి నిధులను ఇచ్చేందుకు అబర్న్ యాజమాన్యం అంగీకరించింది. ఈ మేరకు అమెరికా యూనివర్సిటీ ప్రాంగణంలో ఒప్పందం కుదిరింది. అబర్న్ యూనివర్సిటీ ఫారెస్ట్రీ కాలేజీ డీన్ డాక్టర్ జానకి అలవలపాటి, తెలంగాణ ఫారెస్ట్ కాలేజీ డీన్ ప్రియాంక వర్గీస్‌లు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

సంవత్సరానికి ఇద్దరు చొప్పున ప్రతిభావంతులైన విద్యార్థులకు ఫారెస్ట్రీలో ఎమ్మెస్ చదివేందుకు కుదుర్చుకున్న ఈ ఒప్పందం ఆరేళ్ల పాటు అమల్లో ఉంటుందని వారు తెలిపారు. అబర్న్ యూనివర్సిటీ ప్రతినిధులు విన్నీ నాథన్, డాక్టర్ క్రిస్టోఫర్ రాబర్ట్స్, బ్రెట్ వైట్, ఫ్యాకల్టీ, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం తెలంగాణకు హరితహారం అమలు, విజయవంతంపై అబర్న్ యూనివర్సిటీ ప్రతినిధులు, విద్యార్థులకు ప్రియాంక వర్గీస్ ప్రత్యేకంగా వీడియో ప్రజంటేషన్ ఇచ్చారు. తొమ్మిదేళ్లుగా అమలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 7.7 పచ్చదనం పెంపు సాధించినట్లు తెలిపారు. హరితహారంపై ఆసక్తి చూపిన అమెరికా లెక్చరర్లు, విద్యార్థులు అనేక ప్రశ్నల ద్వారా సమాచారం తెలుసుకున్నారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక పచ్చదనం పెంచాలన్న ముఖ్యమంత్రి సంకల్పంతోనే తెలంగాణకు హరితహారం అమలు అయ్యిందని, ఆ ఫలితాలు ఇప్పుడు రాష్ట్ర మంతటా కనిపిస్తున్నాయని ప్రియాంక వర్గీస్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News