Wednesday, January 15, 2025

సైలెంట్ హార్ట్ ఎటాక్.. క్లాస్ జరుగుతుండగా బెంచ్ మీదే కుప్పకూలి..

- Advertisement -
- Advertisement -

ఇండోర్: వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు అందరికి వచ్చేస్తోంది. దీంతో చిన్నవయసులోనే ఎందరో ప్రాణాలు కోల్పోతూ కన్నవాళ్లకు కన్నీళ్లు మిగులుస్తున్నారు. తాజాగా ఓ యువకుడు క్లాస్ జరుగుతుండగా గుండెపోటు వచ్చి బెంచ్ మీదే కుప్పకూలి మృతి చెందాడు. ఈ విషాదసంఘటన మధ్య ప్రదేశ్ సాగర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇండోర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు సిద్ధమవుతోన్న యువకుడు కోచింగ్ తీసుకుంటున్న క్లాసులోనే కుప్పకూలిపోయాడు.

గమనించిన స్నేహితులు తక్షణమే అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. కోచింగ్ సెంటర్ సిబ్బంది సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవున్నారు. తరగతి గదిలోని సీసీటీవీ ఫుటేజీలో ఈ విషాదకర ఘటన మొత్తం రికార్డయింది. గత కొన్ని వారాలుగా ఇండోర్‌లోనే కనీసం నలుగురు ‘నిశ్శబ్ద గుండెపోటు’తో ప్రాణాలు కోల్పోయారని మీడియా నివేదికలు పేర్కొన్నాయి.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News