Monday, December 23, 2024

తమిళనాడులో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం!

- Advertisement -
- Advertisement -

చెన్నై: తమిళనాడులో గురువారం తన బాయ్‌ఫ్రెండ్ ముందే ఓ 20 ఏళ్ల కాలేజ్ విద్యార్థిని మానభంగానికి గురయింది. దుండగులు కత్తితో బెదిరించి ఈ దాష్టికానికి ఒడిగట్టారు. ఆ కాలేజ్ విద్యార్థిని కాంచీపురంలో గురువారం సాయంత్రం తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి బయట నడిచి వెళుతుండగా దుండగులు కత్తిచూపి వారిని అడ్డుకున్నారు. అనంతరం ఆమెపై అత్యాచారం చేశారు.

వారిద్దరూ నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఇద్దరు తాగుబోతులు వారి మీద దాడిచేశారు. ఆ తర్వాత మరో నలుగురు వచ్చి చేరారు. అంతా కలిసి ఆ యువతిని బలాత్కరించారని అధికారులు తెలిపారు. ‘ఆ అమ్మాయి ఎదురు తిరిగితే..ఇద్దరినీ చంపేస్తామని నిందితులు హెచ్చరించారు’ అని కాంచీపురం డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ పి.జూలియస్ సీజర్ తెలిపారు. ఆ తర్వాత ఆ యువతిని ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించారు.

‘ఆ గ్యాంగ్ కత్తితో ఆ యువతిని బెదిరించి చీకటి ప్రాంతంలోకి తీసుకెళ్లిందని, తర్వాత ఆమెపై ఒకరి తర్వాత మరొకరు అత్యాచారం చేశారు’ అని సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్టు చేశారు. వారి పేర్లు: విమల్ కుమార్(25), మణికంఠన్(22), శివకుమార్(20), విఘ్నేశ్(22), తెన్నరసు(23). ఆరో దుండగుడి కోసం వెతుకుతున్నారు. ఆ ఆరుగురి మీద బలాత్కారం, లైంగిక వేధింపు కేసును నమోదుచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News