అగర్తల: త్రిపుర చెందిన ఒక కళాశాల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. కదులుతున్న వాహనంలో ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దుండగులు విషమ స్థితిలో ఉన్న ఆమెను పశ్చిమ త్రిపురలోని అమాతలి బైపాస్ వద్ద వదలిలిపెట్టి పరారయ్యారు. సోమవారం తెల్లవారుజామున ఈ దారుణ ఘటన జరిగింది. ఈఘటనలో ప్రధాన నిందితుడైన గౌతమ్ శర్మ అనే వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు బుధవారం అతడిని ప్రశ్నించడం ప్రారంభించారు.
Also Read: పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో ఇంజనీర్ మృతి
సోమవారం రోజంతా ఆ బాలిక ప్రధాన నిందితుడితో కలసి వాహనంలోనే తిరుగుతూ కనిపించిందని, అయితే సోమవారం రాత్రి ఏకాంతంగా ఉండడం చూసి ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ప్రధాన నిందితుడు ఆమెను అమాతలి బైపాస్ సమీపంలో వదిలి పరారయ్యాడని సబ్‌డివిజనల్ పోలీసు అధికారి ఆశిష్ దాస్‌గుప్తా బుధవారం మీడియాకు తెలిపారు. ఆ బాలిక తరచు ప్రధాన నిందితుడితో మాట్లాడుతూ ఉండేదని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అయితే ఆమెపై అత్యాచారానికి పాల్పడింది ఒకరా లేక మరికొందరా అన్నది దర్యాప్తులో తేలవలసి ఉంది.
Also Read: మోడీపై ఫిర్యాదు: పాక్ నటికి ఢిల్లీ పోలీసుల కౌంటర్
బాధిత బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. కాలేజ్ నుంచి ఇంటికి తిరిగివస్తున్న ఆమె కుమార్తెకు ఒక యువకుడు కారులో లిఫ్టు ఇవ్వచూపాడు. అందుకు అంగీకరించిన ఆమె కుమార్తె కారులో ఎక్కగా అందులోనే ఉన్న ముగ్గురు యువకులు ఆమెపై లైంగిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత అపస్మారక స్థితిలో ఉన్న ఆ బాలికను అమతలి బైపాస్ వద్ద వదిలి పారిపోయారు. బంధువులు ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న బాలిక తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి తరలించారు.
Also Read: యువజంట ముద్దులు…. ఢిల్లీ మెట్రో సుద్దులు (వీడియో వైరల్)
ఈ వార్త తెలిసిన వెంటనే బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాపియా దత్తా, బిజెపి మహిళా మోర్చ నాయకులు ఆసుపత్రిని సందర్శించి బాధితురాలి ఆరోగ్యం గురించి విచారించారు. ముఖ్యమంత్రి మాణిక్ సహా ఆదేశా ల మేరకే తాము బాధితురాలి వద్దకు వెళ్లినట్లు దత్తా తెలిపారు. ఈ సంఘటనను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన, నిందితులకు కఠిన శిక్ష విధించాలని ఆయన డిమాండ్ చేశారు. బాధితురాలికి, ఆమె కుటుంబానికి అండగా బిజెపి ఉంటుందని ఆయన చెప్పారు.