Wednesday, January 22, 2025

డిగ్రీ విద్యార్థినిపై ప్రేమోన్మాది కత్తితో దాడి

- Advertisement -
- Advertisement -

డిగ్రీ పరీక్ష రాసేందుకు వచ్చిన ఓ విద్యార్థినిపై ప్రేమోన్మాది విచక్షణారహితంగా కత్తితో దాడి చేసిన సంఘటన మెదక్ పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… హైదరాబాద్‌కు చెందిన ఒక యువతి మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దూరవిద్యలో డిగ్రీ చదువుతోంది. పరీక్షల నిమిత్తం ఆమె అవుసులపల్లిలో బంధువుల వద్ద ఉంటూ పరీక్షలకు హాజరవుతోంది. కొన్నాళ్ల నుంచి బెంగుళూరుకు చెందిన చేతన్ అలియాస్ కిరణ్ అనే యువకుడు ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. తన ప్రేమను అంగీకరించడం లేదని కోపం పెంచుకున్న చేతన్ సోమవారం పరీక్షలు రాయడానికి మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు

వచ్చిన ఆమె వద్దకు వెళ్లి చేతిలో ఉన్న సెల్‌ఫోన్‌ను పగులగొట్టి, తనవెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసి పరారయ్యాడు. ఈ ఘటనలో యువతి చేతికి గాయమై రక్తస్రావమైంది. స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం ఆమెను మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరంమెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఘటన విషయం తెలుసుకున్న మెదక్ టౌన్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. నిందితుడిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని పట్టణ పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News