Monday, December 23, 2024

కార్పొరేట్ విద్యాసంస్థల ఆగడాలు….. విద్యార్ధులకందని హాల్‌టికెట్లు

- Advertisement -
- Advertisement -

రుసుముల పేరుతో దోపిడీ
ఇంటర్ బోర్డు
తీసుకోవాలంటూ యు.ఎస్.ఎఫ్.ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్
తక్షణమే హాల్ టికెట్లు ఇవ్వాలి

studying in China and Pak

మన తెలంగాణ/హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షల సమయంలో హాల్‌టికెట్లు ఇవ్వకుండా కార్పొరేట్ విద్యాసంస్థలైన శ్రీచైతన్య, నారాయణ సంస్థలు విద్యార్ధులను ఇబ్బంది పెడుతున్న కారణంగా, ఆ సంస్థలపై ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (యు.ఎస్.ఎఫ్.ఐ) రాష్ట్ర కమిటీ కోరింది. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ విషయంపై యు.ఎస్.ఎఫ్.ఐ సంఘం రాష్ట్ర కార్యదర్శి మాదం తిరుపతి మాట్లాడుతూ విద్యను వ్యాపారంగా మార్చడమే కాకుండా, పలురకాల రుసుముల రూపంలో విద్యార్థుల కుటుంబాల నుండి డబ్బు దండుకుంటున్నారని ఆరోపించారు.

అనేక రకాల ఫీజు రుసుములు వసూలు చేసిన కార్పరేట్ యజమాన్యం, పరీక్షల ముందు హాల్ టికెట్లు ఇవ్వకుండా వారిని ఇబ్బంది పెట్టడం లీగల్‌గా చేసే నేరమని పేర్కొన్నారు. ఇప్పటికే కరుణ పేరుతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, యజమాన్యం ఫీజుల కోసం వేధించడం సిగ్గుచేటన్నారు. ఇంటర్ బోర్డు అధికారులు కార్పోరేటర్ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని., ప్రైవేట్ విద్యా సంస్థలు ఫీజుల పేరుతో ఎన్నో కుటుంబాలను దోపిడీ చేస్తున్నా ఇంటర్ బోర్డు స్పందించకపోవడం ఏంటని మండిపడ్డారు. సమయం ఇంకా మించిపోలేదని, ఇప్పటికైనా ఇంటర్ బోర్డు స్పందించి విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇచ్చే విధంగా కృషి చేయాలని, కార్పొరేట్ విద్యాసంస్థల మీద తగిన చర్యలు తీసుకోవాలని మాదం తిరుపతి డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News