Wednesday, January 22, 2025

ప్రభుత్వం x కొలీజియం

- Advertisement -
- Advertisement -

యాభై ఏళ్ళ క్రితం న్యాయమూర్తుల ఖాళీలను భర్తీ చేసినప్పుడు, చాలా మంది న్యాయమూర్తులు తమ పదవులకు రాజీనామా చేసేవారు. ఇప్పుడా పరిస్థితుల నుంచి ఉపశమనం పొందుతున్నామనుకుంటే, ఇప్పుడదే పరిస్థితి హైకోర్టు స్థాయిలో జరుగుతోంది.నిర్మొహమాటంగా చెప్పాలంటే, దాన్నేం చేయాలో తెలియడం లేదు. న్యాయమూర్తులను నియమించే సుప్రీంకోర్టు కొలీజియం విధానం ఉనికికోసం పెనుగులాడుతోంది. సాంకేతికంగా దెబ్బలు తిని నేలకు కరుచుకుంటోంది. అది ఎదురు దెబ్బలను ఎలా తింటోందో ఒక్కసారి గమనించండి.
జస్టిస్ మురళీ ధరరావు కేసు
ఒరిస్సా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేస్తున్న జస్టిస్ మురళీ ధరరావు దేశంలో ఉన్న అత్యుత్తమ న్యాయమూర్తులలో ఒకరు. ఆయన్ని మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం 2022 సెప్టెంబర్ 28వ తేదీన సిఫారసు చేసింది. కొలీజియం చేసిన ఈ సిఫారసు పైన ప్రభుత్వం స్పందించకపోవడంతో 2023 ఏప్రిల్ 19న మళ్ళీ కొలీజియం ఆ తీర్మానం చేసింది. “కేంద్ర ప్రభుత్వం ఎలాంటి స్పందన లేకుండా కొలీజియం సిఫారసును అలాగే నానబెట్టింది” అని ఆతీర్మానంలో గుర్తు చేసింది. స్పందన అవసరమా? నావరకు స్పందన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలంటే, కొలీజియం సిఫారసును అమలు చేయాలి. అలా చేయనిపక్షంలో ఆ సిఫారసు పునఃపరిశీలనకు తిరిగి పంపాలి.

ఆ సిఫారసు అమలు చేయలేదు సరికదా, పునఃపరిశీలించడానికి కూడా పంపలేదు.ఫలితంగా 2023 ఏప్రిల్ 19న సిఫారసును మళ్ళీ గుర్తు చేసింది. ఇది విఫలమవడంతో ఏ పరిస్థితులు ఏర్పడ్డాయి? ప్రధాన న్యాయమూర్తి లేకుండానే మద్రాసు హైకోర్టు ఆరు నెలలు గడిపేసింది. ఈ ఇబ్బందికరమైన స్థితిని సుప్రీంకోర్టు గమనించినప్పటికీ, మద్రాసు హైకోర్టు పరిపాలనా పరమైన ఇబ్బందిని ఎదుర్కొంది. మద్రాసు హైకోర్టుకు మరో న్యాయమూర్తిని నియమించాల్సిరావడం రెండవ సమస్య. మద్రాసు హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎస్.వి. గంగాపుర్ వాలాను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది.

ఇప్పుడు మద్రాసు హైకోర్టులో ఉన్న జిస్టిస్ టి.రాజా అందరికంటే సీనియర్. ఎస్.వి. గంగాపుర్ వాలా కూడా జిస్టిస్ టి.రాజా కంటే జూనియరే. కాబట్టి, ఆయన జస్టిస్ రాజా పొందవలసిన స్థానాన్ని ఆక్రమించారు. న్యాయ వ్యవస్థలో ఇదొక శాపంలా తయారైంది. యాభై ఏళ్ళ క్రితం ముగ్గురు సీనియర్ న్యామయూర్తులు; జస్టిస్ జె.ఎం. షెలత్, జస్టిస్ కె.ఎస్. హెగ్డే, జస్టిస్ ఎ.ఎన్. గ్రోవర్‌లను కాదని, వారందరికంటే జూనియర్ అయిన న్యాయమూర్తిని ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. రెండేళ్ళ తరువాత జస్టిస్ హెచ్. ఆర్.ఖన్నాను కాదని మరొక జూనియర్‌ను ప్రధాన న్యాయమూర్తిగా నియమించడంతో విసుగు చెంది, దానికి నిరసనగా రాజీనామా చేశారు. ఆ దుర్మార్గమైన చర్యలు హైకోర్టు స్థాయి లో ఇప్పటికీ కొనసాగుతున్నాయి.జస్టిస్ రాజా రాజీనామా చేశారా? చేయకపోతే ఎందుకు రాజీనామా చేయలేదు? వచ్చే మే 23వ తేదీన ఆయన రిటైర్ కాబోతున్నారు. ఆయన సెలవుపైన వెళ్ళవచ్చు లేదా కొనసాగవచ్చు.

కొలీజియం సిఫారసులకు కేంద్ర ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు. హిమాచల్ రాష్ర్ట హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సబిన ను నియమించాలని ముగ్గురు సభ్యుల సుప్రీంకోర్టు కొలీజియం 2023 ఫిబ్రవరి 7వ తేదీన సిఫారసు చేసింది. ఆ పదవికి జస్టిస్ సబీన అన్ని రకాలుగా తగినవారు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. జస్టిస్ సబీనా హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టకుండానే ఈనె 19న రిటైరైపోయారు.
మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గంగాపుర్ వాలాను నియమించడంతో ఏర్పడిన సీనియారిటీ సమస్యను పరిష్కరించడానికి అక్కడే ఉన్న జస్టిస్ రాజాను రాజస్థాన్ హైకోర్టుకు సాధ్యమైనంత త్వరాగా బదిలీ చేయాలని ఈనెల 19న అయిదుగురు సభ్యుల కొలీజియం సిఫారసు చేసింది. దీనికంటే ముందు జస్టిస్ రాజాను రాజస్థాన్ హైకోర్టుకు బదిలీ చేయాలని 2022 నవంబర్ 16న అయిదుగురు సభ్యుల కొలీజియం ప్రభుత్వానికి సిఫారసు చేసింది. (కొలీజియం సిఫారసును టైప్ చేయడంలో ఆ తేదీ 2022 నవంబర్ 24గా పడింది.)

దీనికి కారణం చెప్పలేదు కానీ, బహుశా మంచి పరిపాలన కోసం న్యాయం చేయడం కోసమే. తన బదిలీ విషయంలో పునఃపరిశీలించాలని జస్టిస్ రాజా 2022 నవంబర్ 23వ తేదీన విజ్ఞప్తి చేస్తే ఆ మరుసటి రోజునే ఆయన విజ్ఞప్తిని తిరస్కరించారు. దాంతో జస్టిస్ రాజాను సాధ్యమైనంత త్వర గా రాజస్థాన్‌కు బదిలీ చేయడం ఖరారైంది. ఈ సిఫారసులకు కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేదు సరికదా, జస్టిస్ రాజా బదిలీని నిలుపుదలకు నిర్ణయం కూడా తీసుకోలేదు. జస్టిస్ రాజా ఈనెల 24వ తేదీన రిటైర్ అయ్యారు. కాబట్టి ఆయన బదిలీపైన పట్టుబట్ట లేదు. కొలీజియం తీర్మానం పైన ప్రభుత్వ చర్యలను ఊహిస్తూ జస్టిస్ రాజా రాజస్థాన్ వెళ్ళడానికి తిరస్కరించారు. ఇలాంటి స్థితిలో ఏం చేయాలి? చేయడానికి ఏం లేదు. ఆయన్ని అభిశంసించడానికి కూడా సమయం లేదు.
రాజస్థాన్ రాష్ర్ట ఆర్థిక పరిస్థితి ఏమిటి?

జస్టిస్ బిలాల్ నజ్కిని 2009లో ఒడిషా హైకోర్టుకు బదిలీ చేస్తూ, ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. ఆ పదవిలో ఆయన ఉన్నది అక్కడ మూడు రోజులే.ఆర్థిక ఇబ్బందుల వల్ల రాష్ర్ట ప్రభుత్వం ఆ నియామకాన్ని తిరస్కరించింది. హిందూ స్థాన్ టైవ్‌‌సు ప్రకారం ఆయనక్కడ రిటైరైతే, జీవిత కాల పెన్షన్ కింద 75 లక్షల రూపాయలు ఒడిషా రాష్ర్ట ప్రభుత్వం వెచ్చించాల్సి ఉంటుంది. జస్టిస్ రాజాను రాజస్థాన్‌కు బదిలీ చేస్తే, ఆయన జీవిత కాల పెన్షన్‌ను ఆ రాష్ర్ట ప్రభుత్వం భరించగలదా?
ఆర్.జాన్ సత్యన్, అబ్దుల్ హమీద్‌ల కేసులు
మద్రాసు హైకోర్టులో మరో ఆరుగురు న్యాయమూర్తులను పెంచాలని 2022 ఫిబ్రవరి 6వ తేదీన ముగ్గురు సభ్యుల కొలీజియం ప్రతిపాదించింది. న్యాయవాదుల నుంచి ఇద్దరిని 2022 మార్చిలో, మరో ఇద్దరిని అదే ఏడాది జూన్‌లో నియమించింది.జూన్‌లో నియమితులైన ఇద్దరిపైన వ్యతిరేక ప్రభావం ఉండవచ్చు. మిగతా ఇద్దరు ఆర్. రోహన్ సత్యన్, అబ్దుల్ ఘని అబ్దుల్ ఘనీల గురించి ప్రభుత్వంలో ఎలాంటి స్పందన లేదు. ఆర్. రోహన్ సత్యన్ నిమామకంపైన ప్రభుత్వానికి భిన్నాభిప్రాయం ఉండడం వల్లనేమో ఆ నియామకాన్ని పునః పరిశీలించాలని కొలీజియంకు తిప్పిపంపింది.

దీనిలో స్పష్టత లేదు. కానీ, ప్రభుత్వ అభిప్రాయం నేపథ్యంలో 2023 జనవరి 17న ఆ సిఫారసులను సుప్రీంకోర్టు కొలీజియం తిరిగి ఆమోదం తెలిపింది. తిరిగి ఆమోదం కోసం మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి ఆర్.రోమన్ సత్యన్‌ను హైకోర్టు న్యాయమూర్తిగా నియమించడానికి 2022 ఫిబ్రవరి 16న చేసిన సిఫారసను కొలీజియం వెనక్కి తీసుకుంది. మద్రాసు హైకోర్టుకు న్యాయమూర్తులుగా నియమించడానికి సుప్రీంకోర్టు కొలీజియం తరువాత కొన్ని పేర్లను సిఫారసు చేసింది.
మద్రాసు హైకోర్టులో న్యాయమూర్తులుగా నియమించడానికి అయిదుగురు న్యాయవాదులను, ముగ్గురు న్యాయాధికారులను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఆర్. రోహన్ సత్యన్ వీరందరి కంటే సీనియర్ అయిఉండాలి. సిఫారసు చేసిన వారిలో అయిదుగురు మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులుగా గడిచిన ఫిబ్రవరి 6వ తేదీన, మార్చి 23వ తేదీన నియమితులయ్యారు. వాటిలో వివాదాస్పదమైన గౌరి నియామకం కూడా ఉంది. చివరి ఇద్దరి సీనియారిటీ ప్రతికూల ప్రభావం చూపిందీ, లేనిది స్పష్టం కాలేదు.

కొలీజియం సిఫారసు చేసిన రామస్వామి నీలకందం, ఆర్.రోహన్ శ్యాం నియామకానికి సంబంధించి ప్రభుత్వం స్పందించ లేదు. పైగా, 2023 జనవరి 17న సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసును గౌరవించలేదు. ఈ గందరగోళా లన్నిటి మధ్య అబ్దుల్ ఘనీ అబ్దుల్ హమీద్ నియామకానికి సంబంధించిన సిఫారసును మర్చిపోయారు. 2022 ఫివ్రబరి 16 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ స్పందన లేదు. ఆర్. రోహన్ సత్యన్, అబ్దుల్ ఘనీ అబ్దుల్ హమీద్, రామస్వామి నీలకందంల గురించిన సిఫారసుల భవిష్యత్తు ఏమిటో తెలియదు. కొలీజియం సిఫారసుల ఉపసంహరణ విషాదం గురించి ఎవరికీ ఏమీ తెలియదు.
ఇటీవలి పునరావృతాలు
అమితేష్ బెనర్జీ తనను కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తిగా నియమించమని 2019 జులై 25 చేసుకున్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదిస్తూ ప్రభుత్వానిక సిఫారసు చేసింది. రెండేళ్ళ తరువాత 2023 జులై 21న ప్రభుత్వం దాన్ని వెనక్కి పంపింది. సుప్రీంకోర్టు కొలీజియం 2021 సెప్టెంబర్ 1వ తేదీన ఆ సిఫారసును ఉపసంహరించుకుంది. సక్యన్‌సేన్ పెట్టుకున్న విజ్ఞప్తిని 2019 జులై 24న సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. మూడేళ్ళ తరువాత ఆ సిఫారసును పునరాలోచించుకోమని ప్రభుత్వం 2021 సెప్టెంబర్ 27వ తేదీన తిప్పిపంపింది. సుప్రీంకోర్టు కొలీజియం 2021 అక్టోబర్ 8న తన సిఫారసును ఉపసంహరించుకుంది. ఎలాంటి తాజా సమాచారం లేకుండా, ఎలాంటి ప్రాతిపదిక లేకుండా ఆ ఇద్దరి ఫైళ్ళను 2022 నవంబర్ 25న పునఃపరిశీలనకు వెనక్కి పంపింది. గత జనవరి 18న ఇది పరిష్కారమైంది. సుప్రీం కోర్టు కొలీజియం 2022 నవంబర్ 25న దీనిని పరిష్కరించింది. “

అమితేష్ బెనర్జీ, సాక్యసేన్‌లను కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించడానికి సుప్రీంకోర్టు కొలీజి యం చేసిన సిఫారసులు సాహస యాత్రలాగా తిరగొచ్చాయి”. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. సోమశేఖర్ సుందరేశన్‌ను బొంబా యి హైకోర్టు న్యాయమూర్తిగా 2022 ఫిబ్రవరి 16న కొలీజియం సిఫారసు చేసింది. అదే ఏడాది నవంబర్ 25న ఆ సిఫారసును పునఃపరిశీలించమని ప్రభుత్వం తిప్పి పంపింది. కొలీజియం 2023 జనవరి 18న తమ సిఫారసులను పునరుద్ఘాటించింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా సౌరబ్ కిర్పాల్‌ను నిమించడానికి 2011 నవంబర్ 11న సుప్రీంకోర్టు కొలీజియం ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ ప్రతిపాదనను పునఃపరిశీలించమని ప్రభుత్వం నవంబర్ 25న తిప్పిపంపిం ది. సుప్రీంకోర్టు కొలీజియం 2025 జనవరి 18 దాన్ని పునరుద్ఘాటించింది. ప్రభుత్వం నుంచి స్పందనే లేదు. ప్రియమైన పాఠకులారా మీరే న్యాయమూర్తి అయితే ఈ పరిస్థితిలో మీరేం చేస్తారు?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News