Wednesday, January 22, 2025

కారును ఢీకొన్నలారీ.. ఆరుగురి మృతి

- Advertisement -
- Advertisement -

నాగ్‌పూర్ : మహారాష్ట్ర లోని నాగ్‌పూర్ జిల్లా లో శుక్రవారం అర్ధరాత్రి కారును లారీ బలంగా ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. నాగ్‌పూర్ జిల్లా కటోల్ తాలూకా సోన్‌ఖంబ్ ఏరియాలో ఈ ప్రమాదం జరిగింది. మరోవ్యక్తి స్వల్పగాయాలతోబయటపడ్డాడు. సమాచారం తెలిసిన వెంటనే పోలీస్‌లు అక్కడికి వెళ్లి స్థానికులతో కలిసి సహాయ కార్యక్రమాలు చేపట్టారు. నుజునుజ్జు అయిన కారులో తీవ్ర గాయాలతో ఇరుక్కున్న ఆరుగురిని బయటకు తీసి నాగ్‌పూర్ లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి ట్రామా కేర్ సెంటర్‌లో చికిత్స పొందుతూ ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. బాధితులు 26 ఏళ్ల నుంచి 45 ఏళ్ల లోపువారే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News