Thursday, December 26, 2024

ఆదివరాహ స్వామిని దర్శించుకున్న కొలంబియా వాసి

- Advertisement -
- Advertisement -

కమాన్‌పూర్: మండల కేంద్రంలోని ఆది వరాహ స్వామిని శనివారం దక్షిణ అమెరికాలోని కొలింబియాకు చెందిన వామనస్వామి సందర్శించి, స్వామి వారికి మొక్కులు సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా శ్రీమన్నారాయణుడి భక్తుడిగా మారి భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్‌లో గల బృందావనానికి చేరుకున్నానని తెలిపారు. అక్కడ తన పేరును వామన స్వామిగా ఓ గురువు మార్చారని అన్నారు. అప్పటి నుండి దేశంలోని అన్ని ఆలయాలను సందర్శిస్తూ వస్తున్నాని అన్నారు.

ఈ నేపథ్యంలోనే వైష్ణవ ఆలయాల విశిష్టతను గూగుల్ ద్వారా తెలుసుకుని ఇక్కడికి వచ్చిన స్వామి వారిని దర్శించుకున్నట్లు చెప్పారు. ఇక్కడి స్వామి వారి విశిష్టతను ఆలయ అర్చకులు కలకుంట్ల వరప్రసాదచార్యులు వివరించారని అన్నారు. తాను కొద్దిరోజులు ఈ క్షేత్రంలోనే ఉంటానని, స్వామివారిని దర్శించుకోవడం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News