Monday, December 23, 2024

రవిశాస్త్రికి కర్నల్ సికె నాయుడు పురస్కారం

- Advertisement -
- Advertisement -

అలరించిన బిసిసిఐ అవార్డుల ప్రదానోత్సవం

మన తెలంగాణ/హైదరాబాద్: భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) వార్షిక పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో మంగళవారం హైదరాబాద్‌లో కనుల పండవగా జరిగింది. ఈ కార్యక్రమంలో బిసిసిఐ అధికారులతో పాటు టీమిండియా ప్రస్తుత, మాజీ క్రికెటర్లు క్రికెటర్లు పాల్గొన్నారు. భారత మాజీ క్రికెటర్, ప్రధాన కోచ్ రవిశాస్త్రికి ప్రతిష్టాత్మకమైన కర్నల్ సికె నాయుడు జీవితకాల సాఫల్య పురస్కారం లభించింది.

బిసిసిఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జైషా ఈ అవార్డును రవిశాస్త్రికి అందజేశారు. భారతక్రికెట్‌కు అందించిన సేవలకు గుర్తింపుగా ఈ అత్యుత్తమ అవార్డును బహూకరించారు. రవిశాస్త్రి తన సుదీర్ఘ కెరీర్‌లో 80 టెస్టులు, మరో 150 వన్డేల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించారు. అంతేగాక టీమిండియాకు డైరెక్టర్‌గా, ప్రధాన కోచ్‌గా కూడా వ్యవహరించారు. కాగా, 2022-23 సంవత్సరానికిగానూ పాలీ ఉమ్రిగర్ ఉత్తమ క్రికెటర్‌గా భారత యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ నిలిచాడు.

2021-22 ఉత్తమ క్రికెటర్‌గా జస్‌ప్రీత్ బుమ్రా, 2020-21కిగానూ రవిచంద్రన్ అశ్విన్, 2019-20 సంవత్సరానికిగానూ పాలీ ఉమ్రిగర్ ఉత్తమ క్రికెటర్ అవార్డును మహ్మద్ షమి గెలుచుకున్నారు. 2021-20, 2021-22కిగానూ ఉత్తమ మహిళా క్రికెటర్ అవార్డును భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన సొంతం చేసుకుంది. 2019-20, 2022-23 సంవత్సరాలకు సంబంధించి దీప్తి శర్మ ఉత్తమ మహిళా క్రికెటర్ అవార్డును దక్కించుకుంది.

2022-23 సంవత్సరానికి గాను టెస్టుల్లో అత్యధిక వికెట్లను పడగొట్టిన రవిచంద్రన్ అశ్విన్, అత్యధిక పరుగులను సాధించిన యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌కు దిలీప్ సర్దేశాయ్ అవార్డు లభించింది. ఇదిలావుంటే పూనమ్ యాదవ్, జులన్ గోస్వామి, రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ రౌత్, హర్మన్‌ప్రీత్ కౌర్, మిథాలీ రాజ్, జెమీమా రోడ్రిగ్స్, షెఫాలీ వర్మ, మయాంక్ అగర్వాల్, శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్ తదితరులకు ప్రత్యేక అవార్డులు లభించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News