Monday, December 23, 2024

కల్నల్ సంతోష్ బాబు త్యాగం చిరస్మరణీయం

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: దివంగత కల్నల్ సంతోష్ బాబు త్యాగం చరిత్ర పుటల్లో చిరస్మరణీయంగా నిలిచి పోతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. కల్నల్ సంతోష్ బాబు మూడో వర్ధంతిని పురస్కరించుకుని సూర్యాపేట పట్టణంలోనీ ఆయన విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశం కోసం త్యాగం చేసిన దివంగత సంతోష్ బాబు వర్తమానానికి స్ఫూర్తి దాయకమని ప్రశంసించారు.  ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Also Read: మహిళకు అసభ్య సందేశం.. బలగంతో వచ్చి అటెండర్‌కు దేహశుద్ధి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News